సినిమా ఇండస్ట్రీలో వివాదాలు అనేవి కామన్.. కాని ఒకానొక సమయంలో అవి శృతి మించడం పోలీసు కేసు వరకు వెళ్లడం.. కోర్టుల వరకు కూడా వెళ్లడం జరుగుతుంది. అయిదు సంవత్సరాల క్రితం సౌత్ హీరోయిన్ ఒకామెను కిడ్నాప్ చేసి లైంగిక వేదింపులకు పాల్పడ్డారు. ఆ సంఘటన దేశం మొత్తం చర్చనీయాంశం అయ్యింది. ఒక హీరోయిన్ కు సెక్యూరిటీ లేకుండా పోయింది.. ఒక హీరోయిన్ ను రోడ్డు మీద అల్లరి చేస్తుంటే ఏం చేస్తున్నారు అంటూ దేశం మొత్తం ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆ సమయంలో ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని వెంటనే దోషులను పట్టుకుంది. ఆ కేసులో ఒక మలయాళ హీరో కూడా ఉన్నట్లుగా విచారణలో వెళ్లడి కావడంతో ఆయనను అరెస్ట్ చేయడం కొన్ని నెలల పాటు జైల్లో ఉండటం కూడా జరిగింది.
బెయిల్ పై ఆ హీరో బయటకు వచ్చి సినిమాలు చేసుకుంటున్నాడు. ఆ హీరో మరెవ్వరో కాదు మలయాళ నటుడు దిలీప్. ఆయన ఈ కేసును నీరుగార్చేందుకు తనకు అందుబాటులో ఉన్న ప్రయత్నాలు అన్ని చేస్తున్నాడు అంటూ మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి. తాజాగా మరోసారి అదే విషయం చర్చ జరుగుతోంది. బెయిల్ పై ఉన్న దిలీప్ రెగ్యులర్ గా విచారణకు హాజరు అవుతూనే ఉన్నాడు. ఇక ఈ కేసు విషయంలో న్యాయస్థానం నుండి తుది తీర్పు రావడం లేదు. దాంతో విమర్శలు మొదలు అయ్యాయి. జడ్జ్ ఈ కేసు విషయంలో పక్షపాత వైకరిని అవలంభిస్తున్నట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారు ఆరోపిస్తూ ఇటీవల కేసు నుండి తప్పుకున్న విషయం తెల్సిందే.
ఈ కేసు విషయంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఎలాంటి అప్‌డేట్ కాని హడావుడి కాని లేదు. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకుంది.. సినిమాలకు దూరంగా తన కొత్త జీవితంను సంసార జీవితాన్ని ఆస్వాదిస్తుంది. దాంతో ఆమె కూడా ఈ కేసును లైట్ తీసుకుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో నాకు కోర్టులో న్యాయం జరగడం లేదు అంటూ ఆమె మళ్లీ తెర మీదకు వచ్చారు. ఈసారి ఏకంగా కేరళ ముఖ్యమంత్రికి ఆమె లేఖ రాయడం జరిగింది. ఈ కేసులో మీరే నాకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. హీరోయిన్ లైంగిక వేదింపుల కేసు ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ముఖ్య మంత్రి వద్దకు చేరడంతో అసలు ఏం జరుగబోతుంది.. దిలీప్ కు మళ్లీ జైలుకు వెళ్తాడా అనే చర్చ మొదలు అయ్యింది.