ఆమె సౌత్ మొత్తం మీద క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్. ఈమధ్య లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. గతంలో లాగా ఎక్కువ సినిమాలు కూడా చెయ్యడం లేదు. ఆ హీరోయిన్ నటించిన కొత్త సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అవుతోంది. సాధారణంగా ఈ హీరోయిన్ నటించిన సినిమాలపై ఇటు ప్రేక్షకుల్లో అటు ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు ఉంటాయి. అయితే ఈసారి మాత్రం అలాంటి డిమాండ్ కనిపించడం లేదట.
ఈమధ్యే స్టార్ హీరోయిన్ నటించిన కొత్త సినిమాకు నిర్మాతలు ప్రమోషన్స్ ప్రారంభించారు కానీ పెద్దగా స్పందన దక్కడం లేదు. ఈ హీరోయిన్ నటిస్తే చాలు హాట్ కేక్ లాగా రైట్స్ అమ్ముడవుతాయి అనుకుంటే అందుకు భిన్నంగా ట్రేడ్ లో కూడా పెద్దగా ఎంక్వయిరీలు రావడం లేదట. దీంతో ఈ సినిమాకు బజ్ పెంచేందుకు ఏం చేయాలా అని నిర్మాతలు ఆలోచనలో పడిపోయారట. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు అందుబాటు లో ఉన్న సమయం లోనే కొత్త మార్కెటింగ్ పద్ధతుల్లో సినిమాకు హైప్ పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తప్ప మరో సెల్లింగ్ పాయింట్ లేకపోవడంతో వారికి మార్కెటింగ్ చేయడం ఇబ్బందిగా మారుతోందట.
ఊహకందని విధంగా మారుతున్న ప్రేక్షకుల అభిరుచులతో చాలామంది నిర్మాతలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో సినిమాకు బజ్ లేకపోతే డీసెంట్ ఓపెనింగ్స్ కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈ సమస్య నుంచి నిర్మాతలు ఎలా బయట పడతారో.. సినిమాపై పెట్టిన పెట్టుబడిని ఎలా తిరిగి రాబట్టుకుంటారో వేచి చూడాలి.