అందాల కథానాయికలు ఓ వైపు సినిమాలు.. మరోవైపు షాపుల రిబ్బన్ కటింగులతో నాలుగు చేతులా ఆర్జించడం చూస్తున్నదే. అలానే ఓ అందాల భామకు షాపు ఓపెనింగ్ ఆఫర్ తగిలింది. ఈ ఈవెంట్ కోసమే షాపువాళ్లు లక్షల్లో పారితోషికం చెల్లించారు. అంతేకాదు ఈవెంట్ కి తొడుక్కు రావాల్సిన కాస్ట్యూమ్స్ ని ఖరీదైనవే ఇచ్చారట. సదరు హీరోయిన్ కి లక్ష ఖరీదైన చీర ఖరీదైన జువెలరీస్ ఒక రోజు ముందే తనకు ఇచ్చారట.
అయితే ఆవిడ ఈవెంట్ అయిపోయాక అదే చీరతో హడావుడిగా జంప్ అయిపోవడం బిగ్ షాక్ ఇచ్చిందని రూమర్ వినిపిస్తోంది. నిజానికి ఆ కాస్ట్యూమ్ ని షాపు వాళ్లకే తిరిగి ఇచ్చేయాల్సి ఉన్నా ఎందుకనో అలా కక్కుర్తి పడింది అంటూ అంతా చెవులు కొరికేసుకున్నారు. ఆ తర్వాత కూడా చీరను వెనక్కి ఇవ్వాల్సిందిగా సదరు నాయికను వీళ్లు అడగకపోగా అనవసరమైన రూమర్స్ క్రియేట్ చేస్తున్నారట.
దీనిపై రకరకాలుగా ప్రచారం సాగుతుండడంతో సదరు హీరోయిన్ తీవ్రంగా హర్టయ్యిందని తెలిసింది. అసలు తనకు ఇచ్చిన చీర మరీ అంత ఖరీదైనదేమీ కాదు. పైగా దానిని తనకు గిఫ్ట్ గా ఇచ్చి పంపేశారట. కానీ బయట జరుగుతున్న ప్రచారం మరీ టూమచ్ గా ఉండడంతో హీరోయిన్ హర్టయ్యిందని తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ లో ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఎవరికీ క్లారిటీగా తెలీదు. ఇంతకుముందు ఓ కుర్ర బ్యూటీ కూడా ఇలానే తనపై సాగుతున్న తప్పుడు ప్రచారంపై ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయింది. తనని కావాలనే ఇండస్ట్రీలో తొక్కేసేందుకు కుట్ర పన్నారని కూడా కొందరిపై ఆరోపించింది. ఇక పర్సనల్ మేనేజర్లు.. తెలిసినవాళ్లే ఈ తరహా రూమర్లు క్రియేట్ చేస్తారని కూడా సదరు యంగ్ బ్యూటీ ఆరోపించడం అప్పట్లో కలకలం రేపింది.