ఇన్ స్టాలో ఫోటోలు చూస్తుంటే చాలా మంది నటీమణులు స్టార్లంతా బీచ్ వెకేషన్స్ కి వెళ్లిపోయారని అర్థమవుతోంది. లాక్ డౌన్ లో మహమ్మారీకి భయపడి అంతా ఇండ్లలోనే గడిపారు. కిచెన్ లో వంటలు చేస్తున్నాం.. బాత్రూమ్ క్లీన్ చేస్తున్నాం అంటూ బిల్డప్పులు ఇచ్చారు. మొన్నటి వరకూ ఇదే పరిస్థితి. కానీ ఇప్పుడు అన్ లాక్ సీజన్ నడుస్తోంది. ఇప్పుడంతా ఓపెన్ ఆఫర్. దొరికిందే అదనుగా పలువురు భామలు బీచ్ వెకేషన్లకు ఒంటరి దీవులకు జంప్ అయిపోతుండడం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో షూటింగుల్లో పాల్గొనేందుకు కొందరు వెళుతుంటే చాలా మంది .. విదేశీ బీచ్ విహారానికి ప్రయాణమైపోతున్నారు. ఒంటరి దీవుల్లో చిలౌట్ ని గ్రాండ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది కథానాయికలు మారిషస్.. మాల్దీవులు.. గోవా బీచ్ లకు వెళుతున్నారు. ఇండియాలో గోవాకి రష్ పెరిగింది. టాలీవుడ్ భామల్లో పలువురు గోవా సెలబ్రేషన్స్ కి వెళ్లారు. తాప్సీ సహా చాలా మంది బాలీవుడ్ తారలు మాల్దీవులకు వెళ్లారు. అలాగే మలైకా కరీనా.. శిల్పా శెట్టి లాంటి భామలకు బీచ్ విహారం అంటే అస్సలు వదిలి పట్టడమే లేదు.
టాలీవుడ్ బాలీవుడ్ నుంచి పలువురు భామలు బీచ్ లకు వెళ్లిపోయి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ అన్ లాక్ చేసినంత మాత్రాన కరోనా తగ్గిపోయిందనా? ఎక్కడపడితే అక్కడ తిరిగేస్తే మహమ్మారీ వెంటపడకుండా ఊరుకుంటుందా? జాగ్రత్తమ్మోవ్... జరంత దగ్గేవాళ్లు తుమ్మేవాళ్లను చూస్కోండి. సెలబ్రేషన్స్ లో పడి అవన్నీ మర్చిపోతే అంతే సంగతి.