కొత్తగా వచ్చే ఏ హీరోయిన్ను చూసినా.. టాటూలే ట్యాటూలు. అయితే త్రిష టైపులో యదపై ఒక ట్యాటూ.. సమంతలా నడుంపైన టాటూ.. దీపికా పదుకొనెలా మెడపై ట్యాటూ.. ప్రియాంక చోప్రాలా మణికట్టుపై ఒక పచ్చబొట్టు.. లేదంటే హరిప్రియలా వీపుపై ట్యాటూ.. అసలింతకీ ఈ ట్యాటూ పిచ్చేంటి? ఎందుకు మన ముద్దుగుమ్మలందరూ ఈ ట్యాటులతో హడావుడి చేస్తున్నారా అని చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలే తెలిశాయి.
అప్పట్లో తన యదపై ట్యాటూ గురించి త్రిష ఏం చెప్పిందంటే.. దర్శకులు లో-నెక్ వేసుకొని కాస్త సెక్సీగా కనిపించమని అంటున్నారని.. అందుకే సెక్స్ ఎప్పీల్ కోసం ఆ ప్లేస్‌లో టాటూ వేయించుకున్నా అంటూ చెప్పుకొచ్చింది. మరి మిగిలిన బ్యూటీలు కూడా అలాగే అనుకున్నారేమో కాని.. సమంత కూడా నడుం మీద ట్యాటూ వేయించుకోవడం షాకిచ్చింది. తాప్సీ కాళ్ళపై, సంజన చేతులపై, శ్వేతాబసు వీపుపై వేయించేసుకున్నారు. మరి అందరూ సెక్స్ ఎప్పీల్ను పెంచుకోవడానికేనా? అలా అనుకోలేం. సీనియర్ భామలైన రోజా యదపై ఒక టాటూ వేయించుకుంటే, మథర్ క్యారెక్టర్లు చేస్తున్న ప్రగతి జబ్బపై ఒక ట్యాటూ వేయించుకుంది. వీళ్ళెందుకు వేయించుకున్నట్లు?
ఒక స్టార్ హీరో రేంజ్ రోవర్ కొన్నాడనగానే ఓ పదిమంది వెంటనే రేంజ్ రోవర్లు కొనేశారు. ఒకరు బ్యాంకాక్‌లో హాలీడేకి వెళ్లారనగానే మిగిలిన వారు కూడా వెంటనే హాలీడేస్‌కు వెళిపోతారు. ఒకరు ఫ్యాషన్‌గా ఇంపోర్టెడ్ లేబుల్ డ్రస్సులను వేసుకుంటుంటే.. అందరూ అవే వేయడానికి ట్రై చేస్తున్నారు. సో, ఈ పచ్చబొట్లు ఎలియాస్ ట్యాటూలు కూడా ఇలాంటి క్రేజీ ఫ్యాషన్ సెన్స్ అనుకోవాలంతే.