ఎన్ని బ్రాండ్లు ఉన్నా చైనా ఫోన్ లకు ఉన్న గిరాకీనే వేరు. తక్కువ ఖరీదుతో ఎక్కువ ఫీచర్లు దొరికేస్తాయ్. ఇలా వాడి అలా విసిరేసేందుకు అనుకూలం. మన యూత్ రెగ్యులర్ గా వెంటాడే ఏకైక బ్రాండ్ రెడ్ మీ సెల్ ఫోన్. ఈ కంపెనీ కొన్ని కోట్ల పీస్‌లు క్షణాలు - నిమిషాల్లోనే అమ్మేస్తుంది. ఇందులో లేటెస్ట్ మోడల్ `రెడ్ మి నోట్6 పీఆర్ వో` టూమచ్ హాట్. 6జీబీ మెమరీ - 48 గంటల పాటు డోఖాలేని బ్యాటరీ బ్యాకప్ (4000ఎంఏహెచ్) .. ఐఫోన్ ని మించిన పీచర్లతో కేవలం 15కె రేంజులో లభిస్తుంటే యూత్ ఊరుకుంటుందా? స‌్పాట్ సేల్ ధమాకా మోగించేస్తోంది.
ఇక రెండ్ మి కంపెనీ అంతే తెలివిగా తన బ్రాండ్ ని ప్రమోట్ చేస్తోంది ఇండియాలో. ముంబై టు సౌత్ అందాల కథానాయికలందరినీ ఒడిసిపట్టి వీళ్లతో ఓ రేంజులో ప్రమోషన్ చేస్తోంది. ఇందులో సౌత్-నార్త్ స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ - సమంత - పూజా హెగ్డే - అదాశర్మ - అనిత సోనాక్షి సిన్హా - మౌనిరాయ్ - క్రిస్టిల్ డిసౌజా - దిశా పటానీ - ఈవ్ లిన్ శర్మ - కృతి కర్భంద ఇలా అందాల భామలంతా సామాజిక మాధ్యమాల వేదికగా బోలెడంత ప్రచారం చేస్తున్నారు. వీళ్లతో వీడియో టీజర్ లు రూపొందించి రెడ్ మి కంపెనీ బోలెడంత హంగామా చేస్తోంది.
యూత్ లో దూసుకుపోతున్న భామలందరినీ రెడ్ కోడ్ లోకి దించేసిన సదరు చైనా కంపెనీ అంతర్జాలంలో హాట్ సేల్ కి రెడీ అవుతోంది. నేటి మధ్యాహ్నం 12గంటలకు ధమాకా సేల్ ఆఫర్లను ప్రకటించింది. కొన్ని బ్యాంక్ కార్డులతో క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇవ్వడంతో యూత్ ఎగబడుతున్నారట. సుమారు కోటి పైగా ఫోన్ లు క్షణాల్లో హాట్ కేకుల్లా సేల్ అవుతాయని అంచనా వేస్తున్నారు.