ఇండస్ర్టీకి తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వారసులు ఎంట్రీ ఇస్తున్నారంటే? ప్రేక్షకాభిమానుల్లో అంచనాలు సహజంగానే ఏర్పడుతుంటాయి. తండ్రి ఇమేజ్ తో తనయుడు కొంత వరకూ సాగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ తర్వాత అంతా ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విధానం అన్ని పరిశ్రమల్లోనూ కొనసాగుతుంది. అదే ఓ స్టార్ హీరో తమ్ముడో..అన్నో ఎంట్రీ ఇస్తున్నాడంటే? తనయుడిపై ఉన్నంత బజ్ తమ్ముళ్ల విషయంలో చోటు చేసుకోదు.
ఒకవేళ క్రియేట్ అయినా అది ఎంతో కాలం కొనసాగదు. ఆ షాడో అన్నది కొంత కాలమే కనిపిస్తుంది. ఆ రకంగా అన్నయ్య షాడో ఇమేజ్ నుంచి బయటకొచ్చిన అగ్ర హీరోలు ఎవరైనా ఉన్నారంటే దక్షిణాది పరిశ్రమలో ఈ ముగ్గురు గురించే చెప్పాలేమో. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా ఎలా ఎదిగారో తెలిసిందే.
మెగా ఇమేజ్ తో లాంచ్ అయినా అటుపై అన్నయ్య ప్రభావం తనపై పడకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. తెలుగు రాష్ర్టాల్లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదిం చుకున్నారు. అయితే పవన్ నటుడిగా కంటే వ్యక్తిగతంగా అభిమానులకు బాగా దగ్గరయ్యారు అన్నది వాస్తవం. ఆయనలో సేవాదృక్ఫతమే అతనికి అంత క్రేజ్ ని తీసుకొచ్చింది.
పీకే జనసేన పార్టీని స్థాపించే వరకూ వచ్చారంటే? అభిమానుల్ను అతన్ని ఎంతగా ఇన్ స్పైర్ చేసారు అన్నది అద్దం పడుతుంది. ఇదే స్థాయిలో ఆదరణకు నోచుకున్న మరోనటుడు పునీత్ రాజ్ కుమార్. కన్నడలో రాజ్ కుమార్ వారసుడిగా...శివరాజ్ కుమార్ సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన పునీత్ రాజ్ కుమార్ నటుడిగా తండ్రి..సోదరుల షాడో ఇమేజ్ నుంచి చాలా తొందరగా బయటపడ్డారు.
నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఇతను కూడా అభిమానులకు వ్యక్తిగతంగా బాగా దగ్గరైన నటుడు. నటుడిగా కంటే మానవతా హృదయంగల గొప్ప మనిషిగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. కోట్లాది మంది అభిమానులు ప్రేమను సంపాదించు కున్నారు. అప్పుగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రవేసి దివికెగసారు.
అలాగే కోలీవుడ్ లోనూ ఇలాంటి బ్రదర్ కాంబో ఒకటుంది. వాళ్లే సూర్య...కార్తీ. సూర్య స్టార్ హీరో కావడంతో కార్తీకి ఎంట్రీ ఈజీ అయింది. కానీ నటుడిగా ఎదగడంలో కార్తీ ఎంతో కష్టపడ్డాడు. అన్నయ్య సూచనలు..సలహాలు తీసుకుంటూ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు.
ఇలా వెనుక ఎంత సహకారం ఉన్నా వ్యక్తిగతంగా ఎదగడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతో కమిట్ మెంట్..డెడికేషన్..ఫ్యాషన్ ఉంటే తప్ప సాద్యం కానిది. ఎంతో మంది తమ్ముళ్మ వస్తున్నారు. కానీ అందరూ సూపర్ స్టార్లు కాలేరు. అది కొందరికే సాధ్యమైని పీకే...పునీత్..కార్తీ లాంటి నటులు నిరూపించారు. ఇటీవలే ఇదే విషయాన్ని కింగ్ నాగార్జున సైతం గుర్తు చేసుకున్నా
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.