శ్రీకాంత్ సినిమాకు పడింది పంచ్‌

Update: 2016-04-26 04:02 GMT
‘పోలీసోడు’ అనే పేరు పెడితేనే.. అదేదో పెద్ద తిట్టు అన్న‌ట్లు ఫీలైపోయారు పోలీసులు. వాళ్ల‌తో పేచీ ఎందుక‌ని విడుద‌ల‌కు రెండు రోజుల‌ ముందు టైటిల్ మార్చుకుని వివాదానికి తెర‌దించాడు దిల్ రాజు. ఇక ‘మెంట‌ల్ పోలీస్’ అని పేరు పెట్టుకుని.. పోలీసైన హీరో మెడ‌లో చెప్పుల దండ వేసిన పోస్ట‌ర్లు చూస్తే పోలీసులు ఎలా ఒప్పుకుంటారు? ఈ టైటిల్‌.. ఈ పోస్ట‌ర్లు త‌మ మ‌నోభావాల్ని దెబ్బ తీశాయంటూ లీగ‌ల్ నోటీసులు ఇచ్చినా స్పందించ‌క‌పోవ‌డంతో పోలీసు సంక్షేమ సంఘం హైకోర్టును ఆశ్ర‌యించింది.  అక్క‌డ ‘మెంట‌ల్ పోలీస్’ టీంకు చుక్కెదురైంది. టైటిల్ మార్చేవ‌ర‌కు సినిమా విడుద‌ల ఆపేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దీంతో ‘మెంట‌ల్ పోలీస్’ టైటిల్ మార్చ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఐతే తమ సినిమాలో పోలీసుల్ని గొప్ప‌గానే చూపించామ‌ని.. వారి మ‌నోభావాలు దెబ్బ తీసే స‌న్నివేశాలేమీ లేవ‌ని మెంట‌ల్ పోలీస్ టీమ్ అంటోంది. సినిమా చూసి నిజంగా మార్పులు చేయాలంటే త‌ప్ప‌క చేస్తామంటూ పోలీసుల కోసం ప్ర‌త్యేక  షో ఏర్పాటు చేయ‌డానికి కూడా శ్రీకాంత్ ముందుకొచ్చాడు. కానీ పోలీసుల సంక్షేమ సంఘం మాత్రం అందుకు అంగీక‌రించ‌కుండా హైకోర్టును ఆశ్ర‌యించింది. ఐతే ఇలా సినిమాల‌కు సంబంధించి ప్ర‌తి అంఅం సున్నితంగా మారిపోతుండ‌టం.. వివాదం చేస్తుండ‌టంపైనా విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
Tags:    

Similar News