యుఎస్ సాహోకి టికెట్ రేట్ల ముప్పు

Update: 2019-08-28 08:30 GMT
గత వారం పదిరోజులుగా సాహో తప్ప ఇంకే టాపిక్ సినిమా జనంలో లేదు. ఇది ఎలా ఉంటుంది ఎంత వసూలు చేస్తుంది అనే దాని గురించి తప్ప దేని గురించీ చర్చించుకోవడం లేదు. యుఎస్ లో ప్రీమియర్ల ద్వారానే మిలియన్ మార్క్ టచ్ చేయాలని చూస్తున్న నిర్మాతలకు టికెట్ రేట్లే పెద్ద స్పీడ్ బ్రేకర్ గా మారాయని సమాచారం. ప్రీమియర్ షోలకు తెలుగు వెర్షన్ అయితే 25 డాలర్లు హింది తమిళ్ వెర్షన్లకు 20 డాలర్ల చొప్పున అక్కడి డిస్ట్రిబ్యూటర్ రేట్ ఫిక్స్ చేశాడు. తీరా చూస్తే బుకింగ్స్ అంత ఉదృతంగా లేవు.

గత కొంత కాలంగా యుఎస్ లో టికెట్ ధరలు గరిష్టంగా 12 డాలర్లు మించడం లేదు. మహా అయితే ఇంకో 5 ఎక్స్ ట్రా. అంతకు మించి పెడితే జనం రావడం కష్టమే. కాని ఈ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకంగా అంత ధర నిర్ణయించడం అసలుకే మోసం తెచ్చిందని వినికిడి. ఇప్పుడు దీన్ని మార్చలేరు. రేట్ తగ్గిస్తే నా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. పోనీ రెండు రోజులు ఆగుదామా అంటే అప్పటికే టాక్ తో సహా సినిమా స్వరూపం మొత్తం ఆన్ లైన్ లో పెట్టేస్తారు. చూడాలా వద్దా అని డైలమాలో ఉన్న ఎన్ ఆర్ ఐస్ మీద ఇవి ప్రభావం చూపుతాయి.

ఒకవేళ ముందే 15 డాలర్లు పెట్టి ఉంటే చాలా బెటర్ గా ఉండేదని ఓవర్ కాన్ఫిడెన్స్ తో టికెట్ రేట్లు డిసైడ్ చేయడం ఇప్పుడు ఫైనల్ ఫిగర్స్ నే ప్రభావితం చేసేలా ఉందని అక్కడి ట్రేడ్ మాట. సో ఇక్కడ టాక్ చాలా కీలక పాత్ర పోషించబోతోంది. వెండితెర అద్భుతం అనే మాట వస్తే కాస్త ఎక్కువైనా ప్రేక్షకులు వస్తారు. లేదూ కాస్త అటు ఇటుగా ఉంది అంటేనే అసలు సమస్య. రేపే ప్రీమియర్లు ఉన్నా ఇంకా హాఫ్ మిలియన్ కూడా రికార్డు కాకపోవడం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది.


Tags:    

Similar News