తెరమీద మన్మథుడిగా వెలిగిపోవడమే కాదు టీవీ యాంకరింగ్ లోనూ కింగ్ అని నిరూపించారు నాగార్జున. వివాదాలు అనుమానాల మధ్య మొదలైన బిగ్ బాస్ 3కి తాను కరెక్ట్ ఛాయస్ అని ఋజువు చేశారు. తాజాగా వచ్చిన టిఆర్పి రేటింగ్స్ దాన్నే స్పష్టంగా చెబుతున్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ కు ఏకంగా 17.91 రేటింగ్ రావడం స్టార్ మాను ఆనందంలో ముంచెత్తుతోంది. తెలుగు బిగ్ బాస్ షోలో ఓపెనింగ్స్ ఎపిసోడ్ కి ఇదే హయ్యెస్ట్ రేటింగ్.
ఇంతకు ముందు ఈ రికార్డు జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఈ రికార్డు ఉండేది. తారక్ హోస్ట్ చేసినప్పుడు 16.2 రేటింగ్ తెచ్చుకున్న బిగ్ బాస్ నాని చేతుల్లోకి వచ్చేటప్పటికి 15.1 కి పడిపోయింది. దీంతో ఈసారి ఇంకా తక్కువ వస్తుందేమో అన్న అనుమానాలు భయాల మధ్య ఫైనల్ గా కింగ్ నాగార్జున తన ఛార్మ్ తో షోని నిలబెట్టేశాడు.
ఇల్లు అలగ్గానే పండగ అయిపోలేదు అన్నట్టు అసలు సవాల్ ఇకపై ఉంది. వీక్ డేస్ లో ప్రేక్షకుల ఆసక్తిని కాపాడుకుంటూ వారాంతంలో రెండు ఎపిసోడ్లను నాగ్ తన మేజిక్ తో ఇదే రేటింగ్ ని కాస్త అటు ఇటుగా రాబడుతూ ఉండాలి. అప్పుడే ఛానల్ కు నిశ్చింతతో పాటు స్పాన్సర్లు దొరుకుతారు. రోజువారీగా ఇంత రేటింగ్ రావడం అసాధ్యం కానీ కనీసం ఇందులో సగం వచ్చినా షో సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. కానీ అది చాలా సమీకరణల మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఎలా ఉన్నా మీలో ఎవరు కోటీశ్వరుడు తర్వాత కింగ్ నాగ్ మరోసారి టీవీ యాంకర్ గా ఓపెనింగ్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు. ఇది లాంగ్ రన్ లో ఎంతవరకు నిలుస్తుందో వేచి చూడాలి