కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి నుండి సినీ ప్రేమికులు ఇంకా బయటకు రాలేక పోతున్నారు. చనిపోయి రోజులు గడుస్తున్నా కూడా ఆయన అభిమానులు దుఃఖంలోనే ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతితో ఎంతో మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. పునీత్ లేని విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు బలవన్మరణంకు పాల్పడ్డారు.
పునీత్ పై జనాల్లో ఉన్న అభిమానం ఏ పాటిదో ఆయన మృతి చెందిన సమయంలో వచ్చిన జనాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. కేవలం బెంగళూరు చుట్టు పక్కల నుండి మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా ఆయన్ను చివరి చూపు చూసేందుకు గాను అభిమానులు తరలి కంఠీరవ స్టేడియంలో క్యూ కట్టారు.
అంతటి అభిమానంను దక్కించుకున్న పునీత్ రాజ్ కుమార్ కు కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురష్కారంను ఇవ్వబోతున్నట్లుగా సీఎం స్వయంగా ప్రకటించారు. విశిష్ట సేవలను నిర్వహించిన వారికిగాను కర్ణాటక రత్న అవార్డును ఇస్తూ ఉంటారు.
ఆ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు ఇవ్వబోతున్నట్లుగా సీఎం పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా అభిమానులను దక్కించుకుని సినిమా ఇండస్ట్రీకి సేవ చేసినందుకు గాను పునీత్ రాజ్ కుమార్ కు ఈ గౌరవంను అందిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాల వారు మీడియాకు ఇచ్చిన సమాచారంలో తెలియజేయడం జరిగింది.
పునీత్ రాజ్ కుమార్ కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన నిర్వహించిన సేవా కార్యక్రమాలతో కొన్ని వేల మందికి తోడు.. నీడ.. చదువు దక్కిందని అభిమానులు అంటూ ఉంటారు. వందల కొద్ది స్కూల్స్ లో వేల కొద్ది పిల్లలను చదివించిన ఘనత ఆయనకే దక్కింది.
చనిపోయిన తర్వాత తన కళ్లు కూడా నిరుపయోగం కాకుండా ఎవరికైనా ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో ఆయన కంటిని కూడా దానం చేసిన గొప్ప వ్యక్తి. అందుకే ఆయన్ను కర్ణాటక ప్రభుత్వం అత్యున్నత పురష్కారంతో గౌరవిస్తున్నట్లుగా ప్రకటించారు.