పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించన `రాధేశ్యామ్` రిలీజ్ కి రెడీగా వుంది. ఈ మూవీతో పాటు ఆయన వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లని బ్యాక్ టు బ్యాక్ లైన్ లో పెట్టారు. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీత్ తో `సలార్`, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`, నాగ్ అశ్విన్ తో `ప్రాజెక్ట్ కె` మూవీస్‌ని చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో నాగ్ అశ్విన్ తో చేస్తున్న `ప్రాజెక్ట్ కె` నిత్యం వార్తల్లో నిలుస్తోంది.
పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ఈ మూవీ రూపొందుతుందని దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పడం అందుకు తగ్గట్టుగానే ఇందులో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిసత్ఉండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇటీవల ఈ మూవీ గురించి నిర్మాత సి. అశ్వనీదత్ పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయని, వాతావరణం అనుకూలాస్తే ఈ నెలాఖరు నుంచి తాజా షెడ్యూల్ మొదలవుతుందిన వెల్లడించారు.
వచ్చే ఏడాది 2023 మేలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పేశారు. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది. మొదటి నుంచి ఈ ప్రాజెక్ట్ సైన్స్ ఫిక్షన్ అని దర్శకుడు చెబుతున్న విషయం తెలిసిందే. `ఆదిత్య 369` తరహాలో టైమ్ ట్రావెల్ కథ గా ఈ మూవీ వుంటుందని అంతా భావించారు. ఇప్పుడు అంతకు మించి ఈ మూవీ వుంటుందని తాజాగా బయటికి వచ్చిన ఓ క్రేజీ అప్ డేట్ స్పష్టం చేస్తోంది.
హిమాలయాలు అందులో దాగున్న ఓ వార్మ్ హోల్ (కాలానికి అతీతంగా ప్రమాణం చేసేలా వీలు కల్పించే ఓ ఫిక్షనల్ వే) దానికి సంబంధించిన ఆసక్తికరమైన స్టోరీతో `ప్రాజెక్ట్ కె` రూపొందుతున్నట్టుగా తెలుస్తోంది. అంటే `ఆదిత్య 369` తరహాలో టైమ్ మెషిన్ లో కాకుండా ఓ ఫిక్షనల్ హిమాలయాలు అందులో దాగున్న ఓ వార్మ్ హోల్ నేపథ్యంలో సరికొత్తగా సాగనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
అంతే కాకుండా ఈ మూవీకి `ఆదిత్య 369`తో అద్భుతం సృష్టించిన సింగీతం శ్రీనివాసరావు మెంటర్ గా , క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుండం తాజా అప్ డేట్ నిజమనే బలాన్ని చేకూరుస్తోంది. మరి ఈ వార్తలపై మేకర్స్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి. వైజయంతీ మూవీస్ సంస్థ అత్యంత ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నఈ మూవీకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.