అటు నెట్ ఫ్లిక్స్ లో ఇటు అమేజాన్ లో!

Update: 2021-09-30 23:30 GMT
ఇప్ప‌టికే త‌లైవి హిందీ వెర్ష‌న్ నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల అయ్యింది. సెప్టెంబ‌ర్ 10వ తేదీన థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌కు విడుద‌లైన సినిమా ఇది. అయితే ప‌క్షం రోజుల్లోనే ఓటీటీకి రాక త‌ప్ప‌లేదు. డైరెక్టు ఓటీటీ విడుద‌ల కాకుండా.. ప‌క్షం రోజుల పాటు థియేట‌ర్ల‌కు వ‌దిలారు ఈ సినిమాను. అయితే.. పెద్ద‌గా ఫ‌లితం ద‌క్కిన‌ట్టుగా లేదు. తెలుగు వెర్ష‌న్ ను అయితే ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. హిందీ వెర్ష‌న్ ప‌రిస్థితీ అలానే ఉన్న‌ట్టుంది. అందుకే వెంట‌నే నెట్ ఫ్లిక్స్ లో విడుద‌ల చేసేశారు.

ఇక ఈ సినిమా త‌మిళ‌, తెలుగు వెర్ష‌న్లు కూడా ఓటీటీ విడుద‌ల‌కు రెడీ అవుతున్నాయి. అక్టోబ‌ర్ ప‌దో తేదీన ఈ సినిమా సౌత్ వెర్ష‌న్లు ఓటీటీలోకి వ‌స్తున్నాయి. త‌మిళ‌, తెలుగు వెర్ష‌న్లు అమేజాన్ లో విడుద‌ల కాబోతున్నాయి. హిందీ వెర్ష‌న్ చూడాల‌నుకుంటే నెట్ ఫ్లిక్స్, తెలుగు-త‌మిళ వెర్ష‌న్ల‌కు అమేజాన్ లు ఆప్ష‌న్లుగా నిలుస్తున్నాయి.

ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఫ‌ర్వాలేద‌నే రివ్యూలే వ‌చ్చాయి. కంగ‌నా న‌ట‌న‌కు ఓ మోస్త‌రు ప్ర‌శంస‌లు, అర‌వింద్ స్వామి న‌ట‌న‌కు మ‌రెన్నో ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఎంజీఆర్ రోల్ లో న‌టించిన అర‌వింద్ ను రివ్యూయ‌ర్లు ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు.

ఇక జ‌య‌ల‌లిత జీవిత క‌థ సినిమా అయినా.. భారీ ఎత్తున వివాదాలేవీ లేవ‌లేదు. ప్ర‌త్యేకించి అన్నాడీఎంకే అధికారంలో లేక‌పోవ‌డంతో.. ఆ పార్టీ అభ్యంత‌రం చెప్పే అవ‌కాశాలు త‌గ్గాయి. ఒక‌వేళ అన్నాడీఎంకే అధికారంలో ఉండి ఉంటే.. ఈ సినిమా విడుద‌ల అంత తేలిక‌గా జ‌రిగేది కాదేమో. మ‌రి సౌత్ లో అన్ని వేళ‌లా ఆస‌క్తిదాయ‌కం అయిన జ‌య‌ల‌లిత బ‌యోపిక్ ఓటీటీలో అందుబాటులోకి వ‌చ్చేస్తూ ఉంది.


Tags:    

Similar News