`అఖండ‌`ని హిందీ డ‌బ్బింగ్ తుస్ మ‌నిపిస్తుందే!

Update: 2023-01-05 12:11 GMT
నట‌సింహ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా న‌టించిన `అఖండ‌` ఎంత పెద్ద స‌క్సెస్  సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా అఘోర పాత్ర‌లో బాల‌య్య వాయిస్ వింటేనే?  థియేట‌ర్లు ద‌ద్ద‌రిల‌య్యాయి. థ‌మ‌న్ ఆర్ ఆర్ ఆర్  సినిమాలో కీ రోల్ పోషించింది. అఘోర‌ పాత్ర‌లో వాయిస్ లో పంచ్ ప‌వ‌ర్ కి గూస్ బంప్స్ వ‌చ్చాయి.

అఘోర పాత్ర అంత పెద్ద స‌క్సెస్ అవ్వ‌డంలో?  బాల‌య్య‌ వాయిస్ కూడా ఎంతో కీల‌కంగా మారింది. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త బాల‌య్య‌ని ఆవిష్క‌రించారు. ఇప్పుడీ సినిమా హిందీలో డ‌బ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా హిందీ వెర్ష‌న్ ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ట్రైల‌ర్ తోనే దూసుకుపోతుంద‌నుకుంటే?  సినిమాలో బాల‌య్య వాయిస్ కి డ‌బ్బింగ్  తేడా కొట్టేసింది.

ట్రైల‌ర్లో  బాల‌య్య ఆహార్యానికి డ‌బ్బింగ్ ఏమాత్రం సెట్ కాలేదు. వాయిస్ సింక్ అవ్వ‌లేదు. ఆ వాయిస్ లో ప‌వ‌ర్ లేదు. బేస్ మిస్ అయింది. బాల‌య్య ఎక్స్ ప్రెషెన్స్ కి ...ఆ వాయిస్ కి ఏమాత్రం పొంత‌న కుద‌ర్లేదు. ఏజ్డ్ ఆర్టిస్ట్ డ‌బ్బింగ్ చెప్పిన‌ట్లుంది. దీంతో ఆ పాత్ర‌లో డెప్త్ త‌గ్గిన‌ట్లు అనిపిస్తుంది.  అయితే విజువ‌ల్స్..థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం యధావిధిగా కుదిరాయి.

ఆ సౌండింగ్ త‌ప్ప .. బాల‌య్య డ‌బ్బింగ్ సౌండింగ్  ఏమాత్రం హైలైట్ కావ‌డం లేదు. శివ‌త‌త్వం మీద బేస్ అయిన సినిమా కావ‌డంతో సినిమాపై అక్క‌డా మంచి అంచ‌నాలున్నాయి. ఆ మ‌ధ్య రిలీజ్ అయిన `కార్తికేయ 2` హిందీ బెల్ట్ లో భారీ విజ‌యాన్ని సాధించిన సంగ‌తి తెలిసిందే.  ఉత్త‌రాదిన ఆ సినిమా క‌నెక్ట్ అవ్వ‌డానికి  కార‌ణం విష్ణుతత్వం. ఆ లాజిక్ తోనే `అఖండ` హిందీ లో డ‌బ్ అవుతుంది. అక్క‌డ  డ‌బ్బింగ్  నిర్మాత‌లే  ఈ సినిమాని స్వ‌యంగా రిలీజ్ చేస్తున్నారు.  మ‌రి ఈ సినిమా అక్క‌డ ఎలాంటి ఫ‌లితాలు సాధి్తుందో చూడాలి. ఈ చిత్రానికి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.  


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News