మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే తెలుగు చిత్ర సీమలో కులం వర్గం అనేవి ఉన్నాయని ఇంతకుముందు వెటరన్ రచయిత విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో .. ఇప్పుడు మా అసోసియేషన్ ఎన్నికల వేళ మతం తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ పై హిందూ సంఘాల వాదన సంచలనంగా మారింది.
మా అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ పై హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకి. ఆయన మా సంఘంలో పెత్తనం చేస్తామంటే ఊరుకోలేం. ఆయన ఇంతకుముందు హిందువులను కాకులతో పోల్చారు. హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న నటుడు అతడు.. అని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయన గెలిస్తే హిందూ కళాకారులకు అన్యాయం జరగవచ్చు. ఆయనకు ఓటు వేస్తే మిమ్మల్ని మీరు కాకులుగా ఒప్పుకున్నట్లే.. మా సంఘంలో కాకులు లేవనే భావిస్తున్నామని హిందూ సంఘాల నాయకుడు దుర్గా శ్రీరామ్ వ్యాఖ్యానించడం హీట్ పెంచుతోంది.
హిందూ వ్యతిరేకి అయిన ప్రకాష్ రాజ్ కు సొంత రాష్ట్రంలోనే ప్రజలు తిరస్కరించారని అతడి మద్ధతుదారులు దీనిని గ్రహించాలని ఆయన సూచించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని అన్నారు. మొత్తానికి కులం వర్గంతో పాటు మతం కూడా ఇప్పుడు టాలీవుడ్ లో అదనంగా అధికారికంగా చేరిందని సినీవర్గాల్లో చర్చ హీటెక్కిస్తోంది!!