స్టార్ హీరోపై కేసు పెట్టిన రేప్ విక్టిమ్‌

Update: 2016-06-28 04:16 GMT
బాలీవుడ్‌ లో అంతే.. ఎవరైనా సీనియర్‌ హీరోలు ఏదైనా కామెంట్లు చేశారనుకోండి.. ఖచ్చితంగా బాలీవుడ్‌ మాత్రం దాని గురించి స్పందించదు. ఎందుకంటే సదరు స్టార్‌ హీరో సినిమాల్లో తమకు ఛాన్సు రాదేమోనని. అయితే సాధరణ జనాభా మాత్రం సోషల్ మీడియా సాక్షిగా కోటింగ్‌ ఇచ్చేస్తున్నారు. సుల్తాన్‌ సినిమాలో నటించడం అంటే తన పరిస్థితి ఒక రేప్ విక్టిమ్‌ లా ఉందని సల్మాన్‌ ఖాన్‌ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అతికొద్దిమంది హీరోయిన్లు మనోడు క్షమాపణలు అయినా చెప్పాలని కోరారు.

ఇదంతా ఇలా ఉంటే.. నిజజీవితంలో రేప్ కు గురైన ఒక యువతి.. సల్మాన్‌ పై ఇప్పుడు పరువునష్టం దావా దాఖలుచేసింది. 10 కోట్లు రూపాయలు జరిమానా కట్టాలని.. పబ్లిక్‌ గా అపాలజీ చెప్పాలని డిమాండ్ చేసింది. హర్యానాలోని హిస్సార్ కు చెందిన ఈ అమ్మాయిపై నాలుగేళ్ల క్రితం 10 మంది గూండాలు ఘోరమైన అత్యాచారానికి పాల్పడ్డారు. దానితో ఆమె తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. 10 మందిలో నలుగురికి యావజ్జీవ శిక్ష పడింది. వాళ్లకు ఉరి వేయాలంటూ ఆమె హైకోర్టులో పిటీషన్‌ వేసింది కూడా.

అయితే సల్మాన్ ఖాన్‌ వ్యాఖ్యలతో తన ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైందట. పైగా అతగాడి ప్రకటన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండడం చేత.. సివిల్ అండ్‌ క్రిమినల్ సెక్షన్ల ద్వారా యాక్షన్‌తీసుకోవాలని ఆమె కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. సర్వం కోల్పోయిన తనకు.. ఇలాంటి వ్యాఖ్యలతో మనస్సు ఇంకా గాయపడిందని ఆమె వాపోయారు.
Tags:    

Similar News