మోడల్ కం నటి రుహానీ శర్మ సుశాంత్ సరసన చి.ల.సౌ సినిమాతో తెలుగు పరిశ్రమకు సుపరిచితమైంది. రాహుల్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆరంగేట్రం తనదైన అందం నటనతో ఆకట్టుకున్న రుహానీ డర్టీ హరి- హిట్ ది ఫస్ట్ కేస్ చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం వరుసగా తెలుగు సినిమాలకు సంతకాలు చేస్తున్న ఈ బ్యూటీ అటు తమిళ మలయాళ సినీ పరిశ్రమల్లోనూ అవకాశాలు అందుకుంటోంది.
కడైసి బెంచ్ కార్తీ అనే తమిళ చిత్రం.. కమల అనే మలయాళ చిత్రంలోనూ రుహానీ నాయికగా నటించింది. 2018 నుంచి టాలీవుడ్ లో కెరీర్ సాగిస్తున్న ఈ బ్యూటీ మూడు ముక్కలాటతో కెరీర్ బండిని నడిపించేస్తోంది. తెలుగు-తమిళం-మలయాళంతో పాటు హిందీలోకి ఆరంగేట్రం చేస్తోంది. బాలీవుడ్ లో ఆగ్రా అనే చిత్రంతో డెబ్యూ ఇస్తోంది.
రుహానీ శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ లో పుట్టి పెరిగింది. చండీగర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయ్యారు. శర్మ మొట్టమొదట పంజాబీ మ్యూజిక్ వీడియోలు `క్లాస్ రూమ్` -`కుడి తు పటాకా`లలో కనిపించింది. ఆ తర్వాత సినీరంగంలో సత్తా చాటుతోంది. రుహానీ టాప్ మోడల్. అందుకు తగ్గట్టే వేడెక్కించే వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాని హీటెక్కించేస్తోంది. తాజాగా రుహానీ షేర్ చేసిన ఓ హాట్ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. మునుముందు ఈ హిమచల్ బ్యూటీకి టాలీవుడ్ లో పెద్ద కెరీర్ ఉందనే ఆశిద్దాం.