బాక్సాఫీస్ పై హిట్ 2 హవా..!

Update: 2022-12-12 11:30 GMT
బాక్సాఫీస్ పై హిట్ ది సెకండ్ కేస్ హవా కొనసాగుతుంది. నాని నిర్మాతగా అడివ్ శేష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని శైలేష్ కొలను డైరెక్ట్ చేశారు. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన డైరెక్టర్ శైలేష్ సినిమాలో దానికి న్యాయం చేశాడు. అందుకే హిట్ 2 ప్రేక్షకులకు నచ్చేసింది. క్రైం థ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులని ఎగ్జైట్ చేసే అంశాలతో పాటుగా నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేలా ఆడియన్స్ ని అనుకునేలా చేసే డైరెక్టర్ సక్సెస్ అయినట్టే.

అందుకే హిట్ 2 ఇప్పటికీ థియేటర్ లో దూసుకెళ్తుంది. రిలీజై రెండో వారం కావొస్తున్నా ఇప్పటికీ హిట్ 2 బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబడుతుంది. మొదటి వారం లోనే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట పట్టిన హిట్ 2 ఇప్పుడు చేస్తున్న కలక్షన్స్ అన్ని డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ అని చెప్పొచ్చు.

అయితే డిసెంబర్ 2 తర్వాత నెక్స్ట్ ఫ్రై డే డిసెంబర్ 9న దాదాపు డజను సినిమాల దాకా రిలీజ్ అయ్యాయి. అందులో ప్రేక్షకులకు తెలిసిన సినిమాలు కేవలం రెండు మూడు మాత్రమే. అందులో ఒకటి గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం ఈ మూడు సినిమాల గురించే మాట్లాడుతున్నారు.

సత్యదేవ్ తమన్నా జంటగా నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా యావరేజ్ టాక్ తో ఒక మోస్తారు వసూళ్లను రాబడుతుంది. పంచతంత్రం టాక్ బాగున్నా వసూళ్ల విషయంలో కొద్దిగా వెనకపడి ఉంది. ఈ సినిమాకు ఇంకాస్త పబ్లిసిటీ అవసరమని చెప్పొచ్చు. ఇక ముఖచిత్రం మూవీ కాన్సెప్ట్ బాగున్నా కొన్ని చోట్ల ఎంగేజింగ్ గా అనిపించలేదని టాక్. సో ఈ సినిమాకు ఒక మోస్తారు వసూళ్లే వస్తున్నాయి.  

ఫ్రై డే రిలీజైన సినిమాలు ఏవి అంత గొప్ప టాక్ తెచ్చుకోకపోవడంతో హిట్ 2 రెండో వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పైచేయి సాధిస్తుంది. నిర్మాతగా నాని హిట్ 2తో ఓ సూపర్ హిట్ ప్రాజెక్ట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News