హో ఎగిరే మ‌న‌సే.. ట్యూన్ లో ప్ర‌యోగం

Update: 2022-12-29 16:36 GMT
ప్రేమికుల గుండె గిల్లే మ‌న‌సును సుతారంగా తాకే ఒక అంద‌మైన పాట విని చాలా కాల‌మే అయ్యింది. స్వ‌రాల హోరులో సాహిత్యం వినిపించేది కూడా త‌క్కువే. ఇక ఇటీవ‌లి కాలంలో లిరిక‌ల్ వ్యాల్యూస్ కంటే ట్యూన్ బేస్డ్ గానం యూత్ ని అల‌రిస్తోంది. ఇప్పుడు ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంటర్ టైనర్ `కళ్యాణం కమనీయం` సాంగ్ దీనిని ప్ర‌తిబింబిస్తోంది. 2023 సంక్రాంతి కానుక‌గా జనవరి 14 న  ఈ సినిమా విడుద‌ల కానుంది. UV కాన్సెప్ట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంతోష్ శోభన్ -ప్రియా భవానీ శంకర్ యూత్ హార్ట్ బీట్ ని ట‌చ్ చేసే ప్రేమికులుగా నటించారు.

ఇటీవ‌లే విడుద‌లైన మొదటి పాట `ఓ మానస` ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. తాజాగా `హో ఎగిరే` అంటూ సాగే రెండో పాట‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి కృష్ణకాంత్ సాహిత్యం అందించ‌గా..శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. కపిల్ కపిలన్ ఈ పాట‌ను ఆల‌పించారు. యువ‌హృద‌యాల‌ను మీటే రొమాన్స్ ఈ పాట‌లో ప్ర‌త్యేకం. ట్యూన్ పెప్పీగా ట్రెండీగా నేటిత‌రానికి క‌నెక్ట‌వుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మ్యూజిక్ ప‌రంగా డిఫ‌రెంట్ ఇన్ స్ట్రుమెంటేష‌న్ ని శ్ర‌వ‌ణ్ ప్ర‌య‌త్నించారు. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవి ప్రసాద్ - పవిత్ర లోకేష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కేదార్ శంకర్ ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు . కార్తీక్ ఘ‌ట్టమనేని (సినిమాటోగ్రాఫర్) ..రవీందర్ (ప్రొడక్షన్ డిజైనర్) ప‌నిత‌నం ఈ ఫీల్ గుడ్ మూవీకి అద‌న‌పు అస్సెట్ కానుంది.

రేస్ లో దూసుకెళుతున్న యువ‌హీరో..

యంగ్ హీరో సంతోష్ శోభ‌న్ ఇటీవ‌లే `మంచి రోజులు వ‌చ్చాయి` చిత్రంతో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  ఈ సినిమా చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించింది. `పేప‌ర్ బోయ్`..`ఏక్ మినీ క‌థ` చిత్రాల‌తో న‌టుడిగా ప్రూవ్  చేసుకున్న సంతోష్ `మంచి రోజులు వ‌చ్చాయి`తో క‌మ‌ర్శియ‌ల్ హీరోగాను ట్రాక్ లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం యంగ్ హీరో లైన‌ప్ ఆక‌ట్టుకుంటోంది.  

ఒక సినిమా సెట్స్ లో ఉండ‌గానే మ‌రో చిత్రంలో ఛాన్స్ అందుకుంటున్నాడు. నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో `అన్ని మంచిశ‌కునాలే` అనే  చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్. ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే శోభ‌న్   హీరోగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో .. `జాతిర‌త్నాలు` ఫేం ఫ‌రియా అబ్ధుల్లా హీరోయిన్ గా ఓ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని క‌థ‌నాలొచ్చాయి.  ఇది కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. ప‌క్కా గాంధీ మార్క్ చిత్రంగా తెలుస్తుంది. నిహారిక ఎంట‌ర్ టైన్ మెంట్స్  చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఇవేగాక‌ మ‌రో నాలుగు చిత్రాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. యంగ్  మేక‌ర్స్ యువ హీరోతో సినిమాలు చేయ‌డానికి అమితాస‌క్తి చూపిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Full View
Tags:    

Similar News