హాలీవుడ్ ని టాలీవుడ్ కాపీ కొట్టేయడం పాత టాపిక్. ఇప్పుడు టాలీవుడ్ నే హాలీవుడ్ కాపీ కొట్టేయడం కొత్త టాపిక్. వినడానికి కాసింత జోక్ లా అనిపిస్తుంది కానీ.. ఇది పక్కా నిజం. అదెలాగంటే ... హాలీవుడ్ ని కాపీ కొట్టి మనవాళ్లు సినిమాలు తీసేస్తున్నారని విమర్శిస్తుంటాం. కానీ టాలీవుడ్ సినిమాల్నే హాలీవుడ్ వాళ్లు కాపీ కొట్టేస్తున్నారనడానికి కొన్ని ఆధారాలు లభించాయ్... డీప్ గా వివరంలోకి వెళితే..
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అతడు 2005లో రిలీజైంది. సేమ్ కాన్సెప్టు తో హాలీవుడ్ లో షూటర్ (2007) రిలీజైంది. అతడు తర్వాత రెండేళ్లకు ఈ సినిమా వచ్చింది. కానీ మన విమర్శకులు షూటర్ కి కాపీ అంటూ గగ్గోలు పెట్టారు. అయితే అసలు ఈ క్లాషెస్ ఎందుకొచ్చాయి? అని ఆరాతీస్తే అసలు నిజం తెలిసింది. త్రవిక్రమ్ కాపీ కొట్టింది సినిమాని కాదు. 1993లో అచ్చయిన పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అనే నవల నుంచి త్రివిక్రమ్ ఇన్ స్పయిర్ అయ్యాడు. కంచె స్టోరీ హాలీవుడ్ హిట్ సినిమా డియర్ జాన్ కి కాపీ అంటూ ఇటీవల ప్రచారమైంది. అయితే క్రిష్ దానికి ఓ క్లారిటీ ఇచ్చాడు. డియర్ జాన్ 2010లో రిలీజైంది. కానీ అంతకంటే ముందే కథ రాసుకున్నానని క్రిష్ చెప్పాడు. వాస్తవానికి 2006లో అదే పేరుతో వచ్చిన ఓ నవల నుంచి క్రిష్ ఇన్ స్పయిర్ అయి ఉండొచ్చు. కంచె టీజర్ చూసి అచ్చం అలానే ఉందే అని మనవాళ్లు ఫీలయ్యారంటే సినిమా, నవల రెండూ ఇన్ స్పయిర్ చేశాయేమో.
నితిన్ కొరియర్ బోయ్ కళ్యాణ్ అల్టిమేట్ రష్ అనే హాలీవుడ్ సినిమా నుంచి కాపీ అని అన్నారు. అయితే ఈ సినిమా దర్శకుడు ప్రేమ్ సాయి చెప్పిన దాని ప్రకారం అల్టిమేట్ రష్ 2012లో రిలీజైంది. నేను 2010లోనే కథ రాసుకున్నా అని చెప్పాడు. అంటే అల్టిమేట్ రష్ నవల 2006లోనే పబ్లిష్ అయ్యింది. అంటే పొరపాటు ఎక్కడ జరుగుతోంది. మన దర్శకులంతా తెలివిగా పాత ఆంగ్ల నవలల్ని సినిమాలుగా తీసేస్తున్నారని అర్థం చేసుకోవాలి.