బాలీవుడ్ హీరో కోసం హాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌!

Update: 2022-12-21 13:30 GMT
వ‌రుస పాన్ ఇండియా వండ‌ర్స్ తో ఇండియ‌న్ సినిమా కీర్తి న‌లుదిశ‌లా పాకుతోంది. హాలీవుడ్ సైతం మ‌న సినిమాపై.. మ‌న స్టార్స్ పై.. మ‌నం చేస్తున్న క‌థ‌ల‌పై ఆరా తీస్తోందంటే ఇండియ‌న్ సినిమా ఏ స్థాయిలో వైర‌ల్ అవుతోందో అర్థం చేసుకోడ‌వ‌చ్చు.

రాజ‌మౌళి తెర‌కెక్కించిన 'RRR' ప్ర‌పంచ వ్యాప్తంగా ఇండియ‌న్ సినిమా స‌త్తా ఏంటో చాటింది. దీంతో ప్ర‌తీ హాలీవుడ్ టెక్నీషియ‌న్‌, ఆర్టిస్ట్, మేక‌ర్స్ ల క‌న్ను ఇండియ‌న్ సినిమాపై ప‌డింది. అదే ఇప్ప‌డు బాలీవుడ్ హీరోకు గోల్డెన్ ఆఫ‌ర్ ని తెచ్చిపెట్టింది.

వివ‌రాల్లోకి వెళితే.. బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా ఓ వెబ్‌సిరీస్ ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. కెప్టెన్ అమెరికా సిరీస్‌, అవెంజ‌ర్స్ సిరీస్ ల‌తో పాటు రీసెంట్ గా ధ‌నుష్ తో 'ది గ్రే మ్యాన్‌' మూవీని రూపొందించిన హాలీవుడ్ పాపుల‌ర్ డైరెక్ట‌ర్స్ రుస్సో బ్ర‌ద‌ర్స్ ఎజిబో ఫిలింస్ బ్యాన‌ర్ పై స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న సైన్స్‌ఫిక్ష‌న్ డ్రామా స్పై థ్రిల్ల‌ర్‌ సిరీస్ 'సీటాడెల్‌'. దీనికి ఇండియ‌న్ వెర్స‌న్ ని 'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ తో సంచ‌ల‌నం సృష్టించిన రాజ్ అండ్ డీకె డైరెక్ట్ చేయ‌బోతున్నారు.

అమెజాన్ ప్రైమ్ స్టూడియోస్ కోసం అత్యంత భారీ స్థాయిలో రూపొందించ‌బోతున్న ఈ సిరీస్ లో వ‌రుణ్ ధావ‌న్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ ఇండియ‌న్ వెర్ష‌న్ కు హాలీవుడ్ డైరెక్ట‌ర్స్ రుస్సో బ్ర‌ద‌ర్స్ ప్రొడ్యూస‌ర్స్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు. ఇందులో క్రేజీ హీరోయిన్ స‌మంత కూడా న‌టించ‌నుంది. అయితే ప్ర‌స్తుతం త‌ను మ‌యోసైటీస్ తో బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో సామ్ ఇందులో న‌టిస్తుందా? లేదా అనేది తెలియాల్సి వుంది.

ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ని బుధ‌వారం అమెజాన్ ప్రైమ్ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ద్వారా ప్ర‌క‌టిస్తూ వ‌రుణ్ ధావ‌న్‌ మోష‌న్ పోస్ట‌ర్ ని షేర్ చేసింది. అంతే కాకుండా ఈ సిరీస్ రెగ్యుల‌ర్ షూటింగ్ ని జ‌న‌వ‌రి నుంచి ప్రారంభిస్తున్న‌ట్టుగా కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం.

'న్యూ స్పై ఇన్ టౌన్‌.. సీటాడెల్ ఇండియ‌న్ ఇన్స్టాల్ మెంట్ 2023 జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కాబోతోంది. వ‌రుణ్ ధావ‌న్ ని కొత్త అవ‌తారంలో చూడ‌టానికి నిరీక్షించ‌లేక‌పోతున్నాం' అంటూ షేర్ చేసింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.



Full ViewFull ViewFull ViewFull View
Tags:    

Similar News