ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో క్వాలిటీ పెరుగుతోంది. సినిమాకు అత్యంత కీలకం అని ఏ పాయింట్ ని అయితే దర్శకులు భావిస్తారో.. దాని కోసం ఫారిన్ టెక్నీషియన్స్ ను తీసుకువచ్చేస్తున్నారు. ముఖ్యంగా స్టంట్స్ విషయంలో విదేశీయులకు డిమాండ్ పెరిగిపోతోంది.
విక్రమ్ కె కుమార్- అఖిల్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కోసం హాలీవుడ్ నుంచి బాబ్ బ్రౌన్ ను తీసుకొచ్చారు. హను రాఘవపూడి- నితిన్ కాంబినేషన్ లో రూపొందుతున్న లై చిత్రం కోసం జఫ్రీ ట్రాయ్ జై ను తీసుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో సాహో తీస్తుండగా.. ఈ మూవీకి కూడా ఫారిన్ స్టంట్ మాస్టర్ నే తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా కోసం కూడా ఓ విదేశీ స్టంట్ మాస్టర్ ను టీంలోకి తీసుకొచ్చారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా పీఎస్వీ గరుడవేగను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు.
'వారి ట్యాలెంట్ తో పోలిస్తే మన స్టంట్ మాస్టర్స్ 10 శాతం కూడా చేయలేరు. నేను డిజైన్ చేసిన స్టంట్స్ ను సరిగా తీయడం కూడా చేయలేకపోతున్నారు. అందుకే వాళ్లను హెల్పర్స్ గా పరిగణిస్తాను' అంటున్నాడు ప్రవీణ్ సత్తారు. అయితే హను రాఘవపూడి మాత్రం.. 'మన దగ్గర కూడా మంచి స్టంట్స్ చేయగలిగిన వారు ఉన్నారు. అయితే.. లై మూవీ కోసం థ్యాంక్స్ గివింగ్ డే రోజున షూట్ చేయాల్సి వచ్చింది. అందుకే ఛేజ్ సీన్ కోసం జెఫ్రీని తీసుకున్నాం' అంటున్నాడు.
ఇక మన స్టంట్ మాస్టర్స్ వెర్షన్ వేరేలా ఉంది. 'అడిగిన ఎక్విప్మెంట్ కానీ.. బడ్జెట్ కానీ.. సమయం కానీ మేకర్స్ ఇవ్వడం లేదు. చాలాసార్లు భారీ స్టంట్స్ కోసం 2-3 రోజుల టైం మాత్రమే ఇస్తారు. కానీ ఫారినర్స్ అడిగినవన్నీ ఆనందంగా ఇచ్చేయడానికి మన దర్శక నిర్మాతలకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవు' అంటున్నాడు స్టంట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/