ఓ సినిమా పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలిసేలా చేస్తే.. ఒక సినిమా ప్రభావం ఆ భాష సినిమాలకు గొప్ప పేరు తెస్తే.. అలాంటి సినిమాలు తీసే దర్శకులు. అందులో నటించిన నటీనటులకే కాదు ఆ సినిమాని నిర్మించిన నిర్మాతల గురించి అందరు తెలుసుకోవాలని అనుకుంటారు. ప్రస్తుతం అలాంటి నిర్మాణ సంస్థ కన్నడ పరిశ్రమని ప్రపంచ స్థాయిని తీసుకెళ్లిన నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్. బిజినెస్ లో సెటిల్ అయిన సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఓ ముగ్గురు వ్యక్తులు నిర్మించిన నిర్మాణ సంస్థ హోంబలే.
హోంబలే ఫిలిమ్స్ అనగానే నిర్మాత విజయ్ కిరంగదూర్ ఒక్కరే కనిపిస్తాడు. అయితే ఆయన వెనక మరో ఇద్దరు నిర్మాతలు ఈ సంస్థ కోసం పనిచేస్తుంటారు. విజయ్ తో పాటుగా చలువే గౌడ, కార్తీక్ గౌడ కూడా హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలుగా ఉన్నారు. విజయ్ కిరంగదూర్, చలువే గౌడ అధినేతలుగా ఉండగా కార్తీక్ గౌడ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు. ముగ్గురు కలిసి నిర్మాణ సంస్థ ప్రారంభించాలని అనుకుని వారి ఇలవేల్పు హోంబలమ్మ పేరు మీదగా హోంబలే ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థని ప్రారంభించారు.
హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో వచ్చిన తొలి సినిమా నిన్నందిలే . 2014లో ఈ సినిమా రిలీజైంది. కొత్త వారిని ఎప్పుడూ ప్రోత్సహించే కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ మూవీలో హీరోగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. మొదటి సినిమానే హోంబలే ఫిలిమ్స్ కి భారీ లాసులు మిగిల్చింది. అప్పటివరకు బిజినెస్ లో సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోగొట్టుకున్నారు. ఆ తర్వాత 2015లోనే మరో ప్రయత్నంగా యశ్ హీరోగా మాస్టర్ పీస్ అనే సినిమా నిర్మించారు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. సినిమా నిర్మాణానికి డబ్బు ఒక్కటే కాదు కథ మీద సరైన జడ్జ్ మెంట్ ఉండాలని ఒక్క హిట్టు వచ్చాక వారికి అర్ధమైంది. మాస్టర్ పీస్ సినిమా 35 కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ సాధించింది.
మొదటి సక్సెస్ అందుకున్నాక తొలి సినిమా హీరో పునీత్ రాజ్ కుమార్ తో హోంబలే మూవీస్ 2017లో మరో సినిమా చేసింది. రాజకుమార అంటూ వచ్చిన ఈ సినిమా 76 కోట్ల గ్రాస్ తో కన్నడ పరిశ్రమలో హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీస్ లో ఆరవ ప్లేస్ లో నిలిచింది. మొదటి సినిమా ఫెయిల్ అయినా రెండు, మూడవ సినిమాలతో తమ నిర్మాణ సంస్థని నిలబెట్టుకున్న హోంబలే నిర్మాతలు మాస్ అండ్ కమర్షియల్ సినిమాలనే తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. ఆ ప్రయత్నంలోనే ప్రశాంత్ నీల్ తో కె.జి.ఎఫ్ మొదలు పెట్టారు. పార్ట్ 1 80 కోట్లతో తెరకెక్కించగా కన్నడ సినిమా కనీ విని ఎరుగని రీతిలో కె.జి.ఎఫ్ రికార్డులు సృష్టించింది. కె.జి.ఎఫ్ చాప్టర్ 1 మొత్తం 250 కోట్ల వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇక అదే ఊపుతో కె.జి.ఎఫ్ చాప్టర్ 2ని అదే రేంజ్ లో ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కించారు. చాప్టర్ 2 కూడా 1250 కోట్లు వసూళు చేసింది.
కె.జి.ఎఫ్ చాప్టర్ 1 తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో యువరత్న సినిమా చేశారు హోంబలే నిర్మాతలు. ఆ సినిమా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఇక రీసెంట్ గా కాంతారా మూవీతో మరోసారి తమ బ్యానర్ పేరుని ఇండియా వైడ్ ట్రెండ్ అయ్యేలా చేశారు హోంబలే ఫిలిమ్స్. 16 కోట్లతో తెరకెక్కిన కాంతారా మూవీ 350 కోట్ల వసూళ్లతో అద్భుతాలు సృష్టించింది. కాంతారతో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ కి మరింత క్రేజ్ ఏర్పడింది. ఓ పక్క భారీ సినిమాలు చేస్తూనే మరోపక్క కంటెంట్ ఉన్న సినిమాలను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న హోంబలే నిర్మాతలు ఆ మూవీని కూడా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ ని మించేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. సలార్ తో పాటుగా మళయాళంలో టైసన్, ధూమం, భగీర, రిచర్డ్ ఆంథోని సినిమాలు నిర్మిస్తున్నారు. మొదటి సినిమా అపజయమే తమకు ఎన్నో పాఠాలు నేర్పించింది అంటున్నారు హోంబలే నిర్మాతలు. సాంస్కృత మూలాలను గుర్తుచేసే కథలను తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారు హోంబలే నిర్మాతలు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.