లైగర్‌ ఫ్లాప్‌ తో 'యశోద' పై ఆశలు.. ఖుషి కి అదే దిక్కు!

Update: 2022-10-29 11:31 GMT
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడని అంతా ఆశించారు. కానీ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. లైగర్ సినిమా తో విజయ్ దేవరకొండ స్టార్‌ డమ్‌ పెరుగుతుందని అంతా భావించారు. కానీ ఆయన లైగర్ సినిమా వల్ల నష్టపోయిందే ఎక్కువ అంటూ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి సినిమా లో హీరోయిన్ గా సమంత నటిస్తున్న విషయం తెల్సిందే. లైగర్ సినిమా సూపర్‌ హిట్ అయ్యి ఉంటే ఏమాత్రం అనుమానం లేకుండా ఖుషి సినిమా కి విపరీతమైన క్రేజ్ దక్కేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు.

ఖుషి సినిమాకి బజ్‌ క్రియేట్‌ అవ్వాలి అంటే సమంత నటించిన యశోద సినిమా సక్సెస్‌ అవ్వాల్సి ఉంది. యశోద సినిమా సక్సెస్‌ అయితే ఖుషి సినిమా తప్పకుండా భారీ హైప్ ను దక్కించుకుంటుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

యశోద సినిమా తో మంచి బజ్‌ ను సమంత క్రియేట్‌ చేయాలని విజయ్‌ దేవరకొండ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. యశోద సినిమా విడుదలకు వారం గ్యాప్ మాత్రమే ఉంది. ఈ సమయంలో సమంత అనారోగ్యంతో హాస్పిటల్ బెడ్‌ పై ఉండటం వల్ల యశోద ప్రమోషన్ పరిస్థితి అర్థం కావడం లేదు అంటూ ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమంత వెంటనే అనారోగ్య సమస్య నుండి కోలుకుని యశోద సినిమా ప్రమోషన్ లో పాల్గొనాలి ఆ సినిమా సక్సెస్ అవ్వాలి.. వెంటనే విజయ్‌ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమా లో నటించాలి. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలి. అప్పుడు విజయ్‌ దేవరకొండ బ్యాక్ టు ఫామ్‌ అన్నట్లుగా ఉంటుందని రౌడీ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

విజయ్‌ దేవరకొండ కి సమంత అంటే చాలా అభిమానం. ఆమెతో మహానటి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కానీ ఆ సినిమాలో పూర్తి స్థాయిలో ఇద్దరి మధ్య సన్నివేశాలకు.. స్క్రీన్‌ స్పేస్ కి ఛాన్స్ దక్కలేదు. ఖుషి సినిమాలో ఇద్దరి కాంబోలో మంచి సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.

శివ నిర్వాన గత సినిమాల నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. సమంత యశోద సక్సెస్ అయ్యి ఖుషి సినిమా కూడా సక్సెస్ అయితే ఆమె క్రేజ్ మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News