అల్లు ఇంటిని బెడ్రూమ్ ల వరకే...

Update: 2016-12-15 15:30 GMT
ఇంట్లో మనుషులు పెరిగితే కాస్త పెద్ద ఇల్లు కోరుకోవడం కామన్. కొత్తగా పెద్ద ఇంటిని కట్టుకోవడమో.. ఉన్న ఇంటినే పెద్దదిగా చేయడమో చేస్తుంటారు. ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా అదే పనిలో ఉన్నారు. జూబిలీ హిల్స్ లో తన ఇంటికి సంబంధించిన ఎక్స్ పాన్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు అరవింద్.

అయితే.. ఇప్పటివరకూ మూడు అంతస్తులుగా ఉన్న బిల్డింగ్ కి మరో అంతస్తు జోడిస్తుండడంతో.. వాళ్ల సంగతేమో కానీ చాలామంది ఆస్తులు పంచినట్లుగా అంతస్తులు పంచేశారు. మొదటి అంతస్తులో అల్లు అరవింద్-భార్య నిర్మల.. రెండో అంతస్తులో బన్నీ- భార్య స్నేహారెడ్డి వాళ్ల చిన్నారులు.. మూడో అంతస్తును శిరీష్ కి పంచేశారు. అంతా బాగానే ఉంది కానీ.. మరి అల్లు అరవింద్ కి పెద్ద కొడుకు వెంకట్ ఉన్నాడు కదా.. అతని సంగతేంటో అనే డౌట్ పంచినోళ్లకు రాలేదులే.

నిజానికి విషయం ఏంటంటే.. ఇల్లు పెద్దది చేస్తున్న మాట వాస్తవమే కానీ.. అందులో వాళ్లకు బెడ్ రూమ్ లు మాత్రమే అలాట్ చేస్తారట. మిగతా లివింగ్ రూమ్.. హాల్.. కిచెన్ గట్రా అన్నీ కామన్ గానే ఉంటాయని తెలుస్తోంది. అయినా.. ఇలా ఫ్లోర్లు పంచుకున్నపుడు.. పెద్దోళ్లకు పై ఫ్లోర్లు.. చిన్నోళ్లకు కింద ఫ్లోర్ ఇస్తారు బాసూ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News