బాలీవుడ్ లో ఈ వారం మూడు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో హౌస్ ఫుల్ 4 అత్యంత క్రేజీ తారాగణంతో భారీ అంచనాల నడుమ రిలీజైంది. బడ్జెట్ కాన్వాస్ పరంగా భారీ చిత్రమిది. పైగా పోస్టర్లు ఎంతో క్రియేటివ్ గా చూపించి బజ్ తేగలిగారు. కానీ ఏం లాభం ట్రైలర్ తోనే కన్ఫ్యూజన్ కామెడీ ఎవరికీ అర్థం కాలేదు.
తాజాతా థియేటర్లలోనూ ఆడియెన్ ఫీలింగ్ అలానే ఉందట. ట్రైలర్ లో చూపించినట్టే.. మూడు జంటలు అక్షయ్-పూజ, తుషార్-కృతి సనోన్ .. బాబీ డియోల్- కృతి కర్బంద జంటల మధ్య పునర్జన్మల కథ ఇది. మునుపటి జన్మలో నిశ్చితార్థం చేసుకుంటారు. ఆ ముగ్గురు యువకులు లండన్‌లో బార్లు నడుపుతుంటారు ఈ జన్మలో. పెళ్లి కోసం ఆ ముగ్గురూ భారతదేశానికి వచ్చినప్పుడు తమ గతం గురించి తెలుసుకుంటారు. అటుపై భామలతో బాబులు ఎలాంటి డ్రామా నడిపించారు? అన్నదే కథాంశం. ఓవైపు మగధీర షేడ్స్ మరోవైపు బాహుబలి షేడ్స్ తో ఈ సినిమాని కలగాపులగం చేసేశారు. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన సినిమాల ప్రభావం బాలీవుడ్ పై ఏ స్థాయిలో ఉందో కూడా ఈ సినిమా నిరూపించిందన్న టాక్ వినిపిస్తోంది. పునర్జన్మలు.. భారీ క్రూరమైన గెటప్ లు వగైరా రాజమౌళి సినిమాల్లో చూపించేసారు. ఇక ఆయన రేంజు ఎమోషన్ చూపించడంలో హిందీ డైరెక్టర్లు ఎందుకనో తడబడుతున్నారు మరి.
ఇందులో ఒక్క రానా క్రూరమైన పాత్ర తప్ప ఇంకేదీ ఆకట్టుకోలేదు. అక్షయ్ కి ఇది టైమ్ వేస్ట్ సినిమా అని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ఈ చిత్రానికి 1 స్టార్ 2 స్టార్ తప్ప అంతకుమించి ఇవ్వలేదు. మొత్తానికి ఈ సీజన్ లో ఓ చెత్త సినిమా చూసిన ఫీలింగ్ ఆడియెన్ కి కలుగుతోందట. ఇకపోతే తాప్సీ నటించిన సాంద్ కి ఆంఖ్ చిత్రం సేమ్ డే రిలీజైంది. ఈ సినిమా కొంత బెటర్ అన్న టాక్ వినిపించింది. రాజ్ కుమార్ రావ్- మౌనిరాయ్ జంటగా నటించిన `మేడ్ ఇన్ చైనా` సోసో సినిమానే అన్న టాక్ వచ్చింది.