మార్చురీలోకి రియాను ఎవరు అనుమతించారు

Update: 2020-08-22 06:50 GMT
సుశాంత్‌ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభం అయ్యింది. ఈ కేసును మొదట విచారించిన పోలీసు నుండి మొదలుకుని పోస్ట్‌ మార్టం నిర్వహించిన డాక్టర్ల వరకు పలువురిని మళ్లీ ప్రశ్నించేందుకు సీబీఐ రెడీ అయ్యింది. సుశాంత్‌ ఇంట్లో గతంలో పని చేసిన వారు ఆయన మృతి చెందిన సమయంలో పని చేస్తున్న వారు మరియు ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని కూడా సీబీఐ వారు ప్రశ్నించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఈ కేసులో సీబీఐ వారు ప్రతి చిన్న విషయంలో కూడా చాలా డెప్త్‌ గా ఎంక్వౌరీ చేస్తున్నారట.

సుశాంత్‌ మృతి చెందిన తర్వాత మార్చురీలో ఉంచడం జరిగింది. ఆ సమయంలో రియా చక్రవర్తి అక్కడకు వెళ్లింది. మార్యూరీలోకి ఆమెకు ఎలా అనుమతి వచ్చింది. అసలు ఆమె మార్చురీలోకి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చిందనేది సీబీఐ అధికారులు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. పోస్ట్‌ మార్టం సమయంలో రియా చక్రవర్తి అక్కడే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ విషయంలో కూడా సీబీఐ అధికారులు వైధ్యులను ప్రశ్నించనున్నారట.

ఈ కేసులో ప్రధాన నింధితురాలు రియా చక్రవర్తి అంటూ సుశాంత్‌ అభిమానులు మొదటి నుండి ఆరోపణలు చేస్తున్నారు. బాలీవుడ్‌ వారు మరియు ముంబయి పోలీసులు కొందరు ఆమెను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రియా చక్రవర్తిని సీబీఐ వారు ప్రశ్నించే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. కుక్క బెల్ట్‌ తో సుశాంత్‌ ను చంపి ఆ తర్వాత ఆత్మహత్యగా చూపించేందుకు ప్రయత్నాలు చేశారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి కూడా సీబీఐ ఎంక్వౌరీ సమాధానం ఇస్తుందని సుశాంత్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
Tags:    

Similar News