స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇటీవల ఇద్దరు బిగ్ స్టార్స్ రామ్‌చరణ్, ఎన్టీఆర్ ల తొలి కలయికలో 'RRR' పేరుతో భారీ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కించిన విషయం తెలిసిందే. అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ మార్చిలో భారీ అంచనాల మధ్య విడుదలై ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. వరల్డ్ వైడ్ గా రూ. 1150 కోట్లకు మించి ఐదు భాషల్లో రాబట్టిన ఈ మూవీ మే 20న నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ5, నెట్ ఫ్లిక్స్ లలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.
దక్షిణాది భాషలకు సంబంధించి జీ5 లో, హిందీ భాషకు సంబంధించి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ వెర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లో వీక్షిస్తున్న హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ 'RRR' పై దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మూవీ ఓ అద్భుతం అంటూ కొనియాడుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ అడ్వెంచరస్ మూవీని చేయబోతున్న విషయం తెలిసిందే.
దీనిపై ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాజమౌళి తో సినిమా అంటే అందులో నటించి స్టార్ హీరోలు ఆయన ఫ్యామిలీతో అతి తక్కువ టైమ్ లోనే మింగిల్ అవుతుంటారు. ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'స్టూడెంట్ నెం.1' నుంచి నడుస్తోంది. అలా సినిమా ప్రారంభానికి ముందు తను ఏ హీరోతో వర్క్ చేస్తే ఆ హీరోని తన ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యేలా చేస్తుంటారు రాజమౌళి. ఎన్టీఆర్ తరువాత రామ్‌చరణ్, ప్రభాస్ వంటి హీరోలు రాజమౌళి ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యారు.
హీరోల్లా కాకుండా ఫ్యామిలీ మెంబర్స్ లా మారిపోయారు. అలా మారారు కాబట్టే జక్కన్న వాళ్ల నుంచి తనకు కావాల్సిన ఔట్ పుట్ ని ఈజీగా రాబట్టుకోగలిగారట. త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ టైమ్ లో సెట్ లో.. ఆ తరువాత ఇంట్లో నే ఎక్కువగా గడిపే మహేష్.. రాజమౌళి ఫ్యామిలీతో ఎలా మింగిల్ కాబోతున్నాడు? అన్నది ఇప్పడు ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పైగా రాజమౌళి ఇప్పటి వరకు కలిసి వర్క్ చేసిన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు మాస్ ఆడియన్స్ ఫాలోయింగ్ వుంది. మహేష్ మాత్రం అలా కాదు.. మాస్ .. క్లాస్ ఆడియన్స్ కి చేరు వయ్యారు. మాస్ తో పోలిస్తే క్లాస్ ఆడియన్స్ పర్సెంటేజే ఎక్కువ. మరి ఇలాంటి హీరోతో రాజమౌళి, రాజమౌళి ఫ్యామిలీ ఎలా మింగిల్ కాబోతోంది?.. ఎలా మ్యానేజ్ చేస్తుంది? అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ మూవీని ఆస్త్రేలియా అడవుల నేపథ్యంలో ఓ అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా హాలీవుడ్ చిత్రాలకు మాత్రం తీసిపోని స్థాయిలో తెరపైకి తీసుకురాబోతున్నారు.
విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తాడన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం 'RRR' సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న రాజమౌళి వచ్చే ఏడాది ఈ మూవీని ప్రారంభించే అవకాశం వుందని తెలుస్తోంది. అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేతి కె.ఎల్. నారాయణ నిర్మించబోతున్నారు.