సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ దాదాపు పన్నెండేళ్ల విరామం తరువాత కలిసి సినిమా చేస్తున్నారు. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు గత కొన్నినెలలుగా ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి ఈ మూవీ సోమవారం లాంఛనంగా పట్టాలెక్కింది. రెండు నెలల క్రితమే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఫైనల్ గా సెట్స్ పైకొచ్చింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైంది. ప్రాజెక్ట్ డిజైనర్ ఏ.ఎస్. ప్రకాష్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్ లో యాక్షన్ ఘట్టాలతో షూటింగ్ ని మొదలు పెట్టారు. మునుపెన్నడూ చేయని విధంగా ఈ మూవీని హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ప్రారంభించారు.
ఈ షెడ్యూల్ దాదాపు నెల రోజుల పాటు సాగనుందట. బస్ నేపథ్యంలో సాగే యాక్షన్ సన్నివేశాలని ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెకండ్ షెడ్యూల్ నుంచి పూజా హెగ్డే సెట్ లోకి అడుగు పెట్టనుందట.
ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ షూటిగ్ ప్రారంభమైన సందర్భంగా మేకర్స్ 'ఆరంభం' పేరుతో ఓ వీడియోని విడుదల చేశారు. దీనికి తమన్ అందించినే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇదే సందర్భంగా కొంత మంది త్రివిక్రమ్ సినిమాకే ఇది ఎలా సాధ్యం అవుతోందని క్వొశ్చన్ చేస్తున్నారు. గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన 'అఖండ'కు తమన్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తరువాత డీజే టిల్లు, భీమ్లానాయక్ సినిమాలకు మాత్రమే తమన్ ఆకట్టుకునే నేపథ్య సంగీతాన్ని అందించాడు. కానీ రాధేశ్యామ్, గని, థాంక్యూ, గాడ్ ఫాదర్ (టీజర్‌కు) ఆశించిన స్థాయిలో బ్యాగ్రౌండ్ స్కోర్ ని అందించలేక తీవ్రంగా నిరాశ పరిచాడు.
అయితే తాజాగా త్రివిక్రమ్, మహేష్ ల ప్రాజెక్ట్ ఆరంభ వీడియోకు బ్యాగ్రౌండ్ స్కోర్ అదరగొట్టడంతో అంతా త్రివిక్రమ్ కే ఇది ఎలా సాధ్యమవుతోంది?.. తమన్ నుంచి ఇలాంటి సంగీతాన్ని తను ఎలా రాబట్టగలుగుతున్నాడు? అని ఇండస్ట్రీ వర్గాలు వాపోతున్నాయట.
తమన్ కు త్రివిక్రమ్ ఇచ్చే ఫ్రీడమ్ ని బట్టే అతని నుంచి అబ్బురపరిచే ట్యూన్ లు వస్తున్నాయనే మరో వాదన వినిపిస్తోంది. దీనికి నిదర్శనమే 'అల వైకుంఠపురములో' ఆల్బమ్ అని అంటున్నారు. అంతే కాకుండా తమన్ కు త్రవిక్రమ్ కు మధ్య గురుశిష్యలు బాండింగ్ బలంగా కుదిరిందని అదే తమన్ అద్భుతాలు చేసేలా చేస్తోందని ఇన్ సైడ్ టాక్.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.