‘ఆది పురుష్’ టీమ్ ఆ లాజిక్‌ని ఎలా మిస్స‌వుతోంది?

Update: 2022-11-08 00:30 GMT
ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి మైథ‌లాజిక‌ల్ డ్రామా `ఆది పురుష్‌`. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని తెర‌కెక్కించారు. జ‌పాన్ లో రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కిన `రామాయ‌ణ : ది లిజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామా` అనే యానిమేటెడ్ మూవీ స్ఫూర్తితో ఈ సినిమాని తెర‌పైకి తీసుకొచ్చిన‌ట్టుగా ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇక్క‌డే ద‌ర్శ‌కుడు విమ‌ర్శ‌కుల‌కు అడ్డంగా దొరికి పోయాడు.

దీంతో ఈ మూవీ టీజ‌ర్ పై ఊహించ‌ని విధంగా ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. శ్రీ‌రాముడిగా ప్ర‌భాస్ మేకోవ‌ర్‌, హ‌ను మంతుడి పాత్ర‌.. ల‌క్ష్మ‌ణుడు.. రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ ని చూపించిన తీరు.

ఇలా ప్ర‌తీ పాత్ర‌ని పురాణాల‌కు పూర్తి భిన్నంగా చూపించిన తీరు ప్రేక్ష‌కుల‌ని తీవ్ర అస‌హ‌నానికి గురిచేసింది. దీంతో ద‌ర్శ‌కుడితో పాటు మేక‌ర్స్ పై దారుణంగా ట్రోల్స్ కు దిగారు. రామాయ‌ణాన్ని పూర్తిగా మార్చేసి చూపించిన తీరు విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.  

దీంతో ఈ మూవీ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకుంటోందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్ట‌డం మొద‌లు పెట్టింది. ఈ నేప‌థ్యంలోనే ఈ వార్త‌ల‌ని నిజం చేస్తూ చిత్ర బృందం `ఆది పురుష్‌`ని సంక్రాంతిరి రిలీజ్ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించి షాకిచ్చింది. గ‌త కొన్ని రోజులుగా ఈ మూవీ పోస్ట్ పోన్ పై వ‌స్తున్న వార్త‌ల‌ని నిజం చేస్తూ ఈ మూవీని జూన్ 16కు వాయిదా వేస్తున్నాయంటూ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

అయితే ప్ర‌భాస్ సినిమాకు ఈ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించ‌డం ఏంట‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. జూన్ 2న షారుఖ్ ఖాన్ న‌టిస్తున్న `జావాన్‌` రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాతో పాటు హాలీవుడ్ మూవీస్ ` స్పైడ‌ర్ మ్యాన్ అక్రాస్ ది స్ర‌పైడ‌ర్ వ‌ర్స్ ` పార్ట్ 1 జూన్ 2న‌, ట్రాన్స్ ఫార్మ‌ర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్స్‌` జూన్ 9న ,  భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్నాయి. ఇలాంటి సినిమాల మ‌ధ్య `ఆది పురుష్‌`ని రిలీజ్ చేయాల‌నుకోవ‌డం సాహ‌స‌మేన‌ని చెబుతున్నారు. భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా 3డీ ఫార్మాట్ థియేట‌ర్ల‌న్నీ అక్ర‌మించ‌బ‌డ‌తాయి.

ఇది `ఆది పురుష్‌`కు ఇబ్బంది క‌రంగా మారే ప్ర‌మాదం వుంది. ఓవ‌ర్సీస్ లోనూ ఈ మూవీకి ఇదే ఇబ్బందులు త‌లెత్తితే ప్ర‌భాస్ సినిమా ప‌రిస్థితి ఏంటి? అని ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్లు కూడా సందేహాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అంతే కాకుండా జూన్ లో అన్ని విద్యాసంస్థ‌లు రీఓపెన్ అవుతుంటాయి. ఆ స‌బ‌మంలో స్టూడెంట్స్, పిల్ల‌లు థియేట‌ర్ల‌కు రావ‌డం కష్టం.. ఈ లాజిక్ ని `ఆది పురుష్` టీమ్ ఎలా మ‌ర్చిపోయింద‌ని అభిమానులు కామెంట్ లు చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News