ముఖం దాచేస్తే నిజం దాగునా సారూ?

Update: 2022-08-04 05:42 GMT
సాగ‌ర క‌న్య శిల్పాశెట్టి భ‌ర్త‌.. బిజినెస్ మేన్ రాజ్ కుంద్రా మాస్క్ గేమ్ ఇంకెన్నాళ్లు? ఇదిగో ఈ ఫోటో చూశాక అభిమానుల ప్ర‌శ్న ఇది. అత‌డు చాలా కాలంగా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు. ప‌బ్లిక్ లోకి వ‌చ్చిన‌ప్పుడు మాస్క్ ధ‌రించి ముఖాన్ని దాచేస్తున్నారు. అయితే ఇంకా ఇలా ఎన్నాళ్లు చేయ‌గ‌ల‌రు? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌నం.

రాజ్ కుంద్రా ఇటీవ‌లి వివాదాలు అరెస్ట్ వ్య‌వ‌హారం గురించి తెలిసిందే. కోర్టులో బెయిల్ కోసం చాలా కాలం వేచి చూడాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు బెయిల్ పై అత‌డు బ‌య‌ట ఉన్నారు.

అయితే అత‌డు ఎక్క‌డికి వెళ్లినా కానీ మాస్క్ వేసుకుని తిరుగుతున్నాడు. నీలి చిత్రాల యాప్ ల బిజినెస్ మేన్ గా పాపుల‌ర‌వ్వ‌డంతో అత‌డిని జ‌నం ఇటీవ‌ల చూస్తున్న విధానం మారింది. అందుకే అత‌డు ఇలా చేస్తున్నాడంటూ నెటిజ‌నులు విమ‌ర్శిస్తున్నారు.

రాజ్ కుంద్రా తన ముఖాన్ని వింతైన‌ నల్లని మాస్క్ లు హెల్మెట్ లతో కప్పుకుంటున్నాడు. దీనికి ఫోటోగ్రాఫర్లు కూడా అలవాటు పడ్డారు. అయితే ఎంతకాలం ఇలా మొహం దాచుకుంటాడు? అన్న‌దే చిక్కు ప్ర‌శ్‌న‌. నిన్న‌టి రేయి శిల్పా శెట్టి- రాజ్ కుంద్రా ఒక ఈవెంట్ కి బయలుదేరి వెళ్లిన‌ప్పుడు కెమెరాల‌కు ఫోజులివ్వాల్సి వ‌చ్చింది. అక్క‌డ శిల్పా స‌హ‌జంగా ఫోజులివ్వ‌గా.. రాజ్ కుంద్రా నల్లటి దుస్తులు ధ‌రించి బ్లాక్ మాస్క్ తో అక్క‌డ స్టెప్పులేస్తూ క‌నిపించాడు.

రాజ్ కుంద్రా ప‌లువురు న‌టీమ‌ణుల‌ను నీలి చిత్రాల రాకెట్ లోకి బ‌ల‌వంతంగా లాగార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దీనిపై కొంద‌రు నాయిక‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలపై ముంబై పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలో అరెస్టు చేశారు.

ప‌లువురు ఔత్సాహిక నటీమణులకు వెబ్ సిరీస్ లలో పాత్రలు ఇస్తామని వాగ్దానం చేసినా.. అందుకు భిన్నంగా సెట్స్ లో స్క్రిప్ట్ మార్చి బెదిరించి నీలిచిత్రాల యాప్ ల కోసం షూటింగుల చేశార‌ని ఆరోపించారు. కుంద్రాపై ఇప్ప‌టికీ విచార‌ణ సాగుతోంది. అయితే శిల్పా శెట్టి తిరిగి త‌న అవ‌కాశాల‌ను మెరుగుప‌రుచుకున్నారు. హ‌బ్బీ దాగుడుమూత‌లు ఇంకెన్నాళ్లో వేచి చూడాలి.
Tags:    

Similar News