మా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు

Update: 2021-10-12 05:04 GMT
హోరా హోరీగా సాగిన మా ఎన్నికల తుది ఫలితాలు రావడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఆదివారం పొద్దు పోయే వరకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఆది వారం అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలిచినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని మొత్తం ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. సోమవారం నాటికి తుది ఫలితాలు వచ్చాయి. యాంకర్‌ అనసూయ ఆదివారం రాత్రి గెలిచినట్లుగా వార్తలు వచ్చాయి. కాని సోమవారం వెలువరించిన ఫలితాల్లో మాత్రం ఆమె ఓడిపోయినట్లుగా ప్రకటించారు. ఎన్నికల ఫలితాలపై ఆమె అనుమానం వ్యక్తం చేసింది. బ్యాలెట్ పేపర్స్ ఇంటికి తీసుకు పోయారు అంటూ ఆమె చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌ నుండి ఎక్కు మంది గెలుపొందినట్లుగా మొదట వార్తలు వచ్చినా ఆ తర్వాత మాత్రం ప్రకాష్ రాజ్‌ ప్యానల్‌ లో 8 మంది.. మంచు విష్ణు ప్యానల్‌ నుండి 10 మంది గెలిచినట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. మొత్తానికి సోమవారం తుది ఫలితాలు కాస్త గందరగోళంగా ఉన్నాయంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.

మా ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మీకోసం..
అధ్యక్ష పదవికి పోటీ పడ్డ మంచు విష్ణుకు 383 ఓట్లు మరియు ప్రకాష్ రాజ్ కు 274 ఓట్లు వచ్చాయి. మంచు విష్ణు 109 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
జనరల్ సెక్రటరీగా గెలుపొందిన రఘుబాబు 341 ఓట్లు వచ్చాయి.
ఎగ్జిగ్యూటీవ్ వైస్‌ ప్రెసిడెంట్ గా గెలుపొందిన శ్రీకాంత్‌ కు 375 ఓట్లు వచ్చాయి.
జాయింట్ సెక్రటరీ లు గా గెలుపొందిన ఉత్తేజ్ కు 333 ఓట్లు.. గౌతమ్ రాజుకు 322 ఓట్లు వచ్చాయి.
వైస్ ప్రెసిడెంట్ గా గెలుపొందిన మాదాల రవికి 376 ఓట్లు వచ్చాయి.
కోశాదికారిగా గెలిచిన శివ బాలాజీకి 360 ఓట్లు పడ్డాయి.

గెలుపొందిన 18 మంది ఈసీ మెంబర్స్.. వారికి పడ్డ ఓట్లు
శ్రీనివాసులు - 296
తనీష్‌ - 306
ప్రభాకర్ - 319
సి మాణిక్‌ - 236
శ్రీలక్ష్మి - 330
బ్రహ్మాజీ - 334
అశోక్‌ - 336
గీత సింగ్ - 342
శివారెడ్డి - 362
కౌశిక్ - 269
బొప్పన్న విష్ణు - 271
సుడిగాలి సుధీర్‌ - 279
హరనాథ్‌ - 296
సురేష్ కొండేటి - 294
శివన్నారాయణ - 290
సంపూర్నేష్ బాబు - 285
శశాంక్ - 284
సమీర్ - 282



Tags:    

Similar News