నిహారిక పెళ్లి సందడి ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ వేడుకలో మెగా హీరోలంతా కుటుంబ సమేతంగా హాజరయ్యారు. బన్ని-స్నేహారెడ్డి.. చరణ్ - ఉపాసన జంటలు ఈ వేదికపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెళ్లి సందడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకెళుతున్నాయి.
ఇక బన్ని అయితే తన సతీమణి డిజైనర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫన్నీ కామెంట్లతో హాట్ టాపిక్ గా మారారు. ప్రతిసారీ బన్నీ టైమింగ్ ఫన్ అభిమానుల్ని ఆకర్షిస్తున్నాయి. స్నేహా ఫోటోను షేర్ చేస్తూ బన్నీ ఇదివరకూ రకరకాల వ్యాఖ్యల్ని జోడించారు. ప్రత్యేక విమానంలో వస్తున్నప్పుడు స్నేహ ఫోటోకి `క్యూటీ` అని వ్యాఖ్యను జోడించారు. స్నేహారెడ్డి కోపంగా అలకతో కనిపిస్తున్న ఫోటోకి శ్రీమతి ఇచ్చిన పోజు క్యూట్ అన్న వ్యాఖ్యను టైమింగ్ తో జోడించారు.
తాజాగా బన్నీ మరోసారి తన శ్రీమతి ఫోటోని షేర్ చేసి ఆసక్తికర వ్యాఖ్యను జోడించారు. అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన దుస్తుల్లో స్నేహా కుందనపు బొమ్మను తలపించగా.. హర్మన్ కౌర్ స్టైలింగ్ చేసిన ఫోటో షేర్ చేశారు. ఇందులో స్నేహ ఫోటోకి బన్నీ `హాట్` అంటూ వ్యాఖ్యను జోడించాడు. బన్ని-స్నేహ జంట ఫోటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో అభిమానులు వాటిని వైరల్ చేస్తున్నారు.