కొన్ని నెలల కిందటే విడుదల అయ్యి మంచి విజయం సాధించిన రానా దగ్గుబాటి సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాను నిజానికి సీనియర్ హీరో రాజశేఖర్ చేయాల్సింది. కానీ క్లైమాక్స్ విషయంలో తనకు.. దర్శకుడు తేజకు అభిప్రాయ భేదాలు రావడంతో తాను ఆ సినిమా నుంచి మర్యాదపూర్వకంగానే తప్పుకున్నట్లు చెప్పాడు రాజశేఖర్. ఐతే ఇలా తన కెరీర్లో అనివార్య కారణాల వల్ల వదులుకున్న మంచి సినిమాలు చాలానే ఉన్నాయంటున్నాడు రాజశేఖర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తొలి సినిమా ‘జెంటిల్‌మన్’ కూడా అందులో ఒకటని రాజశేఖర్ వెల్లడించడం విశేషం.
‘‘శంకర్ దర్శకత్వంలో ‘జెంటిల్‌మన్ సినిమా నేనే చేయాల్సింది. వాళ్లు సడెన్ గా వచ్చి డేట్లు అడిగారు. అప్పటికప్పుడు డేట్లు ఇవ్వలేని పరిస్థితి. చాలా మంది డేట్లు సర్దుబాటు చేసుకుని ఎన్ని సినిమాలైనా చేయగలరు. కానీ నేను అలా చేయలేను. ఆ సమయంలోనే నేను రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో ‘అల్లరి ప్రియుడు’ చేస్తున్నా. దానికిచ్చిన డేట్లను మార్చుకోలేనని చెప్పా. ఇలా నేను నా కెరీర్లో చాలా సినిమాలు మిస్సయ్యాను’’ అని రాజశేఖర్ తెలిపాడు. నిజానికి ఎంబీబీఎస్ చదివిన తాను సినీ పరిశ్రమలోకి రావడమే ఆశ్చర్యమని.. అనుకోకుండా ఓ తమిళ సినిమాలో నటించడం.. అది చూసి టి.కృష్ణ ‘వందేమాతరం’ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగిందని.. ఐతే ఆ చిత్ర నిర్మాత పోకూరి బాబూ రావు తన మాట తడబడటం చూసి తాను సినిమాలకు పనికి రానని అన్నారని.. ఐతే టి.కృష్ణ మాత్రం తాను స్క్రీన్ మీద బాగుంటానని చెప్పి సినిమా చేయించారని.. ఆ సినిమా బాగా ఆడటంతో తన దశ తిరిగిందని రాజశేఖర్ తెలిపాడు.