నాలుగేళ్ల వయసులో తమిళ సినిమాలతో శ్రీదేవి కెరీర్ మొదలైంది. భారతీయ సినీపరిశ్రమలో తొలి లేడీ సూపర్ స్టార్ కావడానికి ముందు.. దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలలో ఆమె ఎన్నో మరపురాని పాత్రలలో నటించారు. అయినా శ్రీదేవి తన కెరీర్ ప్రారంభించిన కోలీవుడ్ లో ఎక్కువ సినిమాల్లో నటించలేదు. హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడి అక్కడే పాపులరై దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏలారు.
అయితే చాలా కాలానికి ఇలయదళపతి విజయ్ సలహా మేరకు శ్రీదేవిని పులి సినిమా కోసం వెనక్కి తెచ్చింది టీమ్. ఇదే శ్రీదేవి నటించిన చివరి తమిళ చిత్రం. దురదృష్టవశాత్తు.. ఇది తనకు అంతగా గుర్తుండిపోయే ప్రాజెక్ట్ కాలేకపోయింది. ఎందుకంటే ఈ మూవీ ఒక నటిగా ప్రశంసల కంటే తెగడ్తలనే తెచ్చి పెట్టింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫెయిలవ్వడమే గాక క్రిటిక్స్ నుంచి ప్రశంసలను అందుకోవడంలో దారుణంగా విఫలమైంది. వీటన్నిటినీ మించి పారితోషికం విషయంలో శ్రీదేవి గొడవ అన్ని పరిశ్రమల్లో పెద్ద డిబేట్ అయ్యింది. తాను కోరిన పారితోషికం ఇవ్వలేదని నిర్మాతలతో సుదీర్ఘ కాలం పోరాడారు శ్రీదేవి.
అసలు వివరాల్లోకి వెళితే.. తమిళంలో పులి విడుదలైన తర్వాత చిత్ర నిర్మాతలు తనకు రూ .50 లక్షలు బాకీ చెల్లాంచాల్సి ఉందని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. రూ .30 లక్షల సేవా పన్నుతో పాటు ఆమె వేతనంగా రూ .2.7 కోట్లు చెల్లించడానికి మేకర్స్ అంగీకరించారని బోనీ పేర్కొన్నారు. అయితే దానికి పులి చిత్ర నిర్మాతలు తర్వాత కౌంటర్ వేశారు. ``సినిమా ప్రారంభంలో శ్రీదేవి కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మేం తనకు అన్నిటినీ చెల్లించాం. అయితే సినిమా నిర్మాణం చివరి దశలో శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఈ చిత్రాన్ని ఇతర భాషలలో విడుదల చేయాలనుకుంటే శ్రీదేవికి అదనంగా చెల్లించాలని కోరారు. అది సరికాదని అన్నాం`` అని తెలిపారు.
పారితోషికంతో పాటు అదనపు మొత్తం తేలేవరకూ శ్రీదేవి పట్టుబట్టి కూచున్నారు. చాలా దఫాలుగా చర్చల తరువాత హిందీ వెర్షన్ శాటిలైట్ హక్కుల్లో 20 శాతం అంటే రూ .55 లక్షలు దాంతో పాటే తెలుగు వెర్షన్ కోసం రూ .15 లక్షలు చెల్లించాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారు. బోనీ కపూర్ తనకు బాలీవుడ్ లో మార్కెట్ ఉందని హిందీలో డబ్ చేయమని పట్టుబట్టారట. `పులి` కోసం ముగ్గురు కాస్ట్యూమ్ డిజైనర్లను ఎంపిక చేసుకుంటే.. మనీష్ మల్హోత్రాని ఎంపిక చేయాలని శ్రీదేవి పట్టుబట్టారు. దాంతో అదనంగా మేము అతనికి రూ .50 లక్షలు చెల్లించాల్సొచ్చింది. హిందీ వెర్షన్ మార్కెటింగ్ డిజైనర్ కోసం రూ .8 లక్షలు చెల్లించాలని ఆమె మా ముక్కు పిండారు! అంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీదేవి కోసమే నిర్మాతలు కోట్లు ఖర్చు చేశారని.. డిమాండ్లను నెరవేర్చినప్పటికీ.. ఆడియో లాంచ్ ఫంక్షన్ కి రాలేదని నిర్మాత ఆరోపించారు. ఆ తరువాత సమస్య స్నేహపూర్వకంగా పరిష్కరించుకున్నారు. కానీ ఈ వివాదం శ్రీదేవిని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి దించేసింది. మీడియా పబ్లిసిటీతో బాగా బ్యాడ్ అయిపోయారు. పులి విడుదల సమయంలో మేకర్స్ ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నారు. దాంతో విజయ్- సుదీప్ - శ్రుతి హాసన్ లాంటి స్టార్లు పారితోషికాలను తగ్గించుకుని ఆదుకున్నారు. అనంతరం విజయ్ అభిమానులు శ్రీదేవిని సోషల్ మీడియాలో తీవ్రపదజాలంతో నిందించారు. ``డబ్బు పిచ్చి ఉన్న నటి`` అంటూ విజయ్ అభిమానులు శ్రీదేవిని తీవ్రంగా దూషించారు. చివరికి పులి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ అవ్వడంతో శ్రీదేవికి అది చిరస్మరణీయ చిత్రంగా మిగల్లేదు. చివరికి కోలీవుడ్ రీఎంట్రీ మూవీ డిజాస్టర్ గా నిలవడం శ్రీదేవికి అస్సలు జీర్ణం కాలేదు.