బాలీవుడ్ నటుడు సోనుసూద్ దేశ ప్రజల్లో రియల్ హీరోగా అవతరించిన సంగతి తెలిసిందే. కొవిడ్-19 విషయంలో అతను ఎంతో ధాతృహృదయంతో వ్యవహరించిన తీరు నటుడిగా కంటే గొప్ప మానవతావాదిగా గుర్తింపునిచ్చింది. కరోనా మొదటి వేవ్ లో అతడి సాయం అసమానమైనది. సెకెండ్ వేవ్ లోనూ అతడి సాయం ఎక్కడా తగ్గలేదు. మొదటి వేవ్ ని మించి అతను ఇప్పుడు మరింతగా సేవలందిస్తున్నారు. ఖరీదైన మందులు..ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితిలో బెడ్లు ఏర్పాటు చేయడం వంటివి ఎన్నో చేసారు. నేరుగా ముంబైలోని సోనుసూద్ ఇంటికెళ్లి తమ కష్టాలను..బాధలను విన్న వించుకుంటే వాటిని పరిష్కరించారు.
సహాయం అంటూ ఎవరు ఆయన ఇంటి గుమ్మం తొక్కినా తప్పక సహాయం చేస్తూ దాతృహృదయాన్ని చాటుకుంటున్నారు. గత రెండు నెలలుగా సోను ఇంటి వద్ద పరిస్థితి ఇలాగే ఉండటంతో ఆయన గదిలో నుంచి బయటకి రావడం..బాధితుడితో మాట్లాడే సమయంలో భారీగా జనం తరలి రావడం తో కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. జనాలు గుమిగూడటం.. తోపులాటలు వంటి సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సోనుసూద్ ఆ క్రౌడ్ ని తగ్గించాలని భావిస్తున్నారుట.
తరుచూ ఇలా జరగడం వల్ల సోనుసూద్ ఇంట్లో ఉండే మిగతా కుటుంబ సభ్యులకు..నివాసితులకు ఇబ్బందికరంగాను మారుతోందిట. అలాగే ఆ చుట్టు పక్కల కాలనీ వాసులకు ఇది ఇబ్బందిగానే మారింది. దీంతో తనని కలవడానికి రావాలనుకున్న వారికి ప్రత్యేకంగా ఓ ప్రదేశాన్ని ఏర్పాటు చేసి అక్కడే కలిసి...స్పాట్ లో సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నారుట.