తమిళ్ లో ఘన విజయం సాధించిన ''విక్రమ్ వేద'' చిత్రాన్ని ఇతర భాషల్లోకి రీమేక్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు హిందీ భాషల్లో ఈ రీమేక్ పై ఎక్కువగా చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్ లో 'విక్రమ్ వేద' రీమేక్ కు రంగం సిద్ధమైంది. ఇందులో బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ - సైఫ్ అలీఖాన్ హీరోలుగా నటించనున్నారు. మాతృకను డైరెక్ట్ చేసిన పుష్కర్ గాయత్రి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. 2022 సెప్టెంబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
కాగా, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - విలక్షణ నటుడు ఆర్.మాధవన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ''విక్రమ్ వేద'' చిత్రం 2017లో విడుదలైంది. గ్యాంగ్ స్టర్ - పోలీస్ ఆఫీసర్ మధ్య నడిచే ఈ డ్రామాలో పోలీస్ ఆఫీసర్ 'విక్రమ్' గా మాధవన్.. గ్యాంగ్ స్టర్ 'వేద' పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించించారు. తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. హిందీ వెర్షన్ లో గ్యాంగ్ స్టర్ గా హృతిక్ రోషన్.. పోలీస్ ఆఫీసర్ గా సైఫ్ అలీఖాన్ నటించనున్నారని తెలుస్తోంది. మరి త్వరలోనే బ్లాక్ బస్టర్ 'విక్రమ్ వేద' తెలుగు రీమేక్ లో ఎవరు నటిస్తారనే దానిపై కూడా క్లారిటీ వస్తుందేమో చూడాలి.