మహేష్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంటా బైటా వసూళ్ల సునామీ సృష్టించింది. దాదాపు 150 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా సాధించిన విజయం బాలీవుడ్ లోనూ హాట్ టాపిక్ ఇప్పుడు. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రముఖ హీరో హృతిక్ రోషన్ రెడీ అవుతున్నారని సమాచారం. శ్రీమంతుడు రీమేక్ హక్కులు ప్రఖ్యాత కార్పొరెట్ దిగ్గజం ఈరోస్ ఇంటర్నేషనల్ వద్ద ఉన్నాయి. ఈ సంస్థ ఇటీవలే హృతిక్ రోషన్, రాకేష్ రోషన్ ఇద్దరి కోసం ప్రత్యేకించి ఓ షోని ఎరేంజ్ చేసిందని, షో చూసిన అనంతరం తండ్రి కొడుకులిద్దరూ ఇంప్రెస్ అయ్యారని చెప్పుకుంటున్నారు.
శ్రీమంతుడు కాన్సెప్టు బావుంది. ఊరిని బాగు చేయడం కోసం ఎన్నారైలు, డబ్బున్నవాళ్లు ముందుకు రావాలి.. అన్న కాన్సెప్టు బావుంది. అయితే బాలీవుడ్ ఆడియెన్ కి తగ్గట్టే మార్పు చేర్పులు చేయాల్సి ఉందని అభిప్రాయ పడ్డారట. అయితే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక చర్చలు సాగుతున్నాయా? లేదా? అన్నది తేలాల్సి ఉందింకా. బాలీవుడ్ వెర్షన్ కి కూడా కొరటాల శివ దర్శకత్వం వహిస్తారా? లేదా వేరే ఎవరైనా దర్శకుడు పనిచేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే మన శ్రీమంతుడు హృతిక్ కి నచ్చాడు. ప్రాజెక్టు ఆన్‌లో ఉన్నట్టే. ఈ స్ర్కిప్టుని బాలీవుడ్ ప్రేక్షకులకు తగ్గట్టే మార్చుకుంటే అక్కడా సెన్సేషన్ అవ్వడం ఖాయమని ప్రముఖులంతా అభిప్రాయపడుతున్నారు.