బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ కు ఇండస్ట్రీలో మంచి పేరే ఉంది. బాగా సౌమ్యుడు అని.. ఎక్కువగా ఆవేశాలు ప్రదర్శించడని.. ఎప్పుడూ కూల్ గా ఉంటాడని అంటారు. మరి ఇంతటి కూల్ పర్సన్ కి కూడా ఓ ఫ్యాన్ కోపం తెప్పించేసిందట.
ఫిట్నెస్ విషయంలో బోలెడన్ని జాగ్రత్తలు తీసుకునే హృతిక్ రోషన్.. ఎప్పటికప్పుడు కొత్త రకాల వర్కవుట్స్ ను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు. తాజాగా ఈ హీరో జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో ఓ మహిళా ఫ్యాన్ ఫోటోలు తీసిందట. ఈ విషయాన్ని గమనించిన హృతిక్ రోషన్ ఆమె దగ్గరకు వెళ్లి.. ఫోటోలు డిలెట్ చేయాల్సిందిగా కోరాడట. కానీ ఆమె తటపటాయించడంతో.. ఆ ఫ్యాన్ ఫోన్ ను చేతిలోకి తీసుకున్న హృతిక్.. ఏకంగా ఫోన్ ను ఫార్మాట్ చేసేసి చేతిలో పెట్టాడట. ఒక ఫోన్ ను ఫార్మాట్ చేసేయడం అనే విషయమే ఇప్పుడు ఎక్కువగా హైలైట్ అవుతోంది.
అనుమతి లేకుండా ఫోటోలు తీసుకోవడం తప్పే అయినా.. తన ఫోటోల వరకు డిలెట్ చేస్తే సరిపోతుంది. అలా కాకపోతే కాసింత గట్టిగా క్లాస్ తీసుకోవచ్చు. కానీ ఏకంగా ఫోన్ ఫార్మాట్ చేసేయడం.. అది కూడా ఒక్కసారి తీసిన ఫోటోల కోసం అంటే మాత్రం.. టూ మచ్ అనాల్సిందే. మరి హృతిక్ రోషన్ కి అంతగా కోపం తెప్పించేసే స్థాయిలో ఫోటోలు ఉన్నాయంటే.. అందులో ఏమంత సీక్రెట్ ఉందో మరి!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/