హీరోయిన్‌ పై హ్రితిక్ కన్నేసి ఉంచాడా?

Update: 2016-03-17 17:30 GMT
బాలీవుడ్ స్టార్స్ హ్రితిక్ రోషన్ - కంగనా రనౌత్ ల మధ్య విబేధాలు ఇప్పుడు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఒకరికొకరు లీగల్ నోటీసులు ఇచ్చుకుని.. పరువు రోడ్డున పడేసుకున్నారు. ఇప్పుడీ పరిస్థితి ఇంకా దారుణంగా తయారువుతోంది.

కంగనాపై కన్నేసి ఉంచేందుకు.. ఆమెపై హ్రితిక్ గూఢచారులను పెట్టాడన్న వార్తలు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. కంగనా ఇంటి బయట కూడా కొందరు కాపలా కాస్తున్నారని.. ఆమె స్నేహితుడొకరు చెబుతున్నాడు. 'కంగనా ఎక్కడికి వెళుతోంది.. ఏ ఫ్లైట్ ఎక్కుతోంది.. ఎవరిని కలుస్తోంది వంటి డీటైల్స్ ను హ్రితిక్ పోగు చేస్తున్నాడు. హ్రితిక్ తో పోల్చితే తన సామాజిక స్థాయి ఏంటో ఆమెకు తెలుసు. నిజానికి తను ఎమోషనల్ గా హ్రితిక్ కి కనెక్ట్ అయింది. ఈ వివాదానికి ముగింపు పలకాలని కంగనా అనుకుంటున్నా.. ఇక్కడితో వదిలేయాలని హ్రితిక్ అనుకోవడం లేద'ని కంగనా సన్నిహితులు అంటున్నారు.

క్రిష్ 3 చిత్రం షూటింగ్ సమయం నుంచి వీరిద్దరి మధ్య అనుబంధం ఏర్పడిందనే టాక్ ఉంది. ఆ తర్వాతే సుసానేకి ఈ హీరో విడాకులిచ్చాడు. అఫ్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉండగా.. 2014 చివరకూ లివిన్ రిలేషన్ లో ఉన్నారని అంటారు. అయితే.. తనను పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం హ్రితిక్ కి లేదని అర్ధమయ్యాక కంగనా దూరమైందని తెలుస్తోంది.
Tags:    

Similar News