బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కుటుంబం మరోసారి వార్తల్లోకి వచ్చింది. గతంలో పలు సందర్బాల్లో హృతిక్ రోషన్ కుటుంబం వార్తల్లోకి వచ్చింది. అయితే ఈసారి మాత్రం హృతిక్ చెల్లి అయిన సునైనా రోషన్ ప్రేమ కారణంగా మీడియాకు ఎక్కింది. ఢిల్లీకి చెందిన ఒక ముస్లీం రిపోర్టర్ ను సునైనా ప్రేమిస్తుందట. అయితే సునైనా ప్రేమకు ఆమె తండ్రి మరియు సోదరుడు ఒప్పుకోవడం లేదని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
తాజాగా సునైనా మీడియా ముందుకు వచ్చి తన ప్రేమ విషయాన్ని చెప్పి తన కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదని.. అతడిని కలుసుకునేందుకు కూడా అనుమతించకుండా గృహనిర్భందం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హృతిక్ రోషన్ తో విభేదాలున్న కంగనా రనౌత్ కు సునైనా తాను ప్రమాదంలో ఉన్నాను, కాపాడు అంటూ మెసేజ్ పెట్టిందట. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చకు తెర లేపింది. మీడియా ఈ విషయమై హృతిక్ రోషన్ ను సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన నో చెప్పాడు.
హృతిక్ ఫ్యామిలీ నుండి సునైనా దూరంగా ఉండాలనుకుంటుందట. ముంబయిలోని తనకు ఒక ప్లాట్ ఇచ్చి నెలకు రెండున్నర లక్షల రూపాయలను ఇవ్వాల్సిందిగా కోరిందట . అందుకు హృతిక్ నో చెప్పడంతో పాటు అతడిని మళ్లీ కలుసుకోకుండా ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే సునైనాకు కొందరు మద్దతు తెలుపుతున్నారు. ఆమె కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులు సహకరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఈ విషయంపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కంగనా సోదరి రంగోలీ మాట్లాడుతూ... ప్రస్తుతం సునైనా ప్రమాదంలో ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా ఉంది. అంతే కాకుండా ఆమెకు కుటుంబ సభ్యుల నుండి కూడా ప్రమాదం పొంచి ఉన్నట్లుగా అనిపిస్తుంది. సునైనా ప్రస్తుతం కంగనా సాయం కోరుతుందని ఈ సందర్బంగా రంగోలీ చెప్పుకొచ్చింది. సునైనా మనసు మార్చేందుకు రోషన్ ఫ్యామిలీ మెంబర్స్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.