రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన సినిమాలు ఈమధ్య కాలంలో హిట్ అయిన దాఖలాలు లేవు. ఆయన సాధారణ ప్రేక్షకులకే టెస్ట్ పెడుతున్నాడని అందరూ అనుకుంటారు కానీ అది నిజం కాదు. ఆయన నిజంగా పరిక్ష పెట్టేది ఆర్జీవీ డై హార్డ్ ఫ్యాన్స్ అభిమానానికి.. రివ్యూయర్ల సహనానికి. వాళ్ళు ఎంత అంచనాలు తగ్గించుకుని ఆయన కోసం థియేటర్ కు వెళ్ళినా తలబొప్పి కట్టడం మాత్రం ఖాయమే. ముఖ్యంగా 'ఆఫీసర్' దెబ్బతో ఆయన వీరాభిమానుల నెత్తిన పిడుగు పడ్డట్టుగా అయింది.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రకటించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎలా ఉంటుందో అనే సందేహాలు వ్యక్తమయ్యాయి కానీ సినిమా ట్రైలర్ తో 'ఒక సెక్షన్ ఆడియన్స్ తప్ప' మిగతా అందరినీ మెప్పించాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాతో వర్మ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టించడం ఖాయమని చాలామంది నెటిజనులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి కారణంగా సినిమాకు మంచి బిజినెస్ జరిగిందని సమాచారం. శివం సెల్యులాయిడ్ సంస్థ సురేష్ రెడ్డి ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను రూ. 9 కోట్లకు సొంతం చేసుకున్నారట. ఆయన గతంలో 'RX100'.. 'U టర్న్' సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేశారు
ఈ సినిమాకు బడ్జెట్ ఎంత అయిందో ఇంకా బయటకు రాలేదు కానీ ఏ లెక్కన చూసుకున్నా వర్మ సినిమాకు ఇది భారీ మొత్తమే. థియేట్రికల్ రైట్స్ కాకుండా మిగతా హక్కులు అన్ని కలిపితే మరో రూ. 3 కోట్ల బిజినెస్ జరిగిందట. అంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ బిజినెస్ రూ. 12 కోట్లు. వర్మ నిజంగా నక్క తోకే తొక్కాడో లేద్దా 'పెద్దాయన' పైనుంచి ఆశీర్వదించాడో తెలీదు గానీ సినిమాకు బిజినెస్ మాత్రం సూపర్ గా జరిగింది. ఈ సినిమాను ఆర్జీవీ మార్చ్ 15 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.