మహేష్ బాబు- ప్రభాస్ లతో పాటు ఇంకా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఒకప్పుడు స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరో గా పరిచయం అయ్యి చాలా సంవత్సరాలు అయ్యింది. అదృష్టం లేకనో లేదా మరేంటో కాని అశ్విన్ సినీ కెరీర్ సాఫీగా సాగడం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా ఈయన కు పెద్దగా క్రేజ్ తెచ్చి పెట్టలేక పోయింది. ఈయన నటించిన సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టలేక పోయాయి.
ఇలాంటి సమయంలో సుమంత్ అశ్విన్ నటించిన ‘ప్రేమకథా చిత్రమ్ 2’ విడుదలకు సిద్దం అయ్యింది. కొన్నాళ్ల క్రితం మారుతి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ కు ఇది కాస్త అటు ఇటుగా సీక్వెల్ అంటూ ప్రచారం జరుగుతుంది. కామెడీ హర్రర్ సినిమాగా రూపొందిన ప్రేమ కథా చిత్రమ్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. అందుకే ఆ సినిమా సీక్వెల్ అనడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలున్నాయి.
కేవలం టైటిల్ కారణంగా ఈ చిత్రానికి మంచి బిజినెస్ అవుతోంది. ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న కారణంగా అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం మంచి రేటు కే అమ్ముడు పోయినట్లుగా తెలుస్తోంది. అలాగే తెలుగు శాటిలైట్ రైట్స్ తో పాటు హిందీ శాటిలైట్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్మేశారు. సుమంత్ కెరీర్ లో మొదటి సారి ప్రీ రిలీజ్ బిజినెస్ బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యిందని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ కు 1.5 కోట్లు రావడం గొప్ప విషయంగా చెబుతున్నారు. ప్రేమ కథా చిత్రమ్ హిందీ వర్షన్ కు మంచి ఆధరణ దక్కింది. అందుకే ఈ సీక్వెల్ కు అక్కడ భారీ క్రేజ్ ఏర్పడినది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.