మొన్న కొత్తగా వదిలిన పోస్టర్ తో సాహో డేట్ ని ఆగస్ట్ 15కి మరోసారి లాక్ చేసిన సాహో టీం అభిమానుల్లో ఉన్న్న సందేహాలకు చెక్ పెట్టేసింది. ఇంకా ప్రమోషన్లు మొదలుపెట్టాల్సి ఉంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి అన్ని బాషలలో విస్తృతంగా పబ్లిసిటీ చేయాల్సి ఉంది. కనివిని ఎరుగని రీతిలో రెండు వందల కోట్ల దాకా పెట్టుబడులు సాగిన సాహో మీద అంచనాల గురించి మాటలలో చెప్పడం కష్టం. ఇప్పటికే ఆ తేదికి దరిదాపుల్లో లేకుండా మిగిలిన నిర్మాతలు తమ ప్లానింగ్ లో ఉండగా హిందిలో సైతం చాలా క్రేజీగా రిలీజవుతున్న సాహోకు అక్కడ మాత్రం సోలోగా వన్ సైడ్ వార్ దక్కడం లేదు
చాలా బలమైన అపోజిషన్ వెల్కం చెబుతోంది. మొదటిది మిషన్ మంగళ్. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మల్టీ స్టారర్ లో విద్యా బాలన్-తాప్సీ-సోనాక్షి సిన్హా-నిత్యా మీనన్ ఇలా పెద్ద స్టార్ క్యాస్టింగ్ తో వస్తోంది. దీని మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఇస్రోకు చెందిన నిజ జీవిత సైంటిస్టుల కథ ఆధారంగా దర్శకుడు జగన్ శక్తి దీన్ని రూపొందిస్తున్నాడు. ఇధీ స్వతంత్ర దినం నాదే రానుంది.
ఇక మరో సినిమా బాట్లా హౌస్. జాన్ అబ్రహం నటించిన ఈ మూవీ ముంబై క్రైమ్ హిస్టరీలో చాలా ప్రత్యేకంగా నిలిచిన ఇన్ హౌస్ ఎన్కౌంటర్ ఆధారంగా దర్శకుడు నిఖిల్ అద్వాని రూపొందించింది. ఎంత లేదన్నా ఈ రెండు క్రేజీ సినిమాల ఎఫెక్ట్ నార్త్ లో సాహో మీద ఉంటుంది. ముఖ్యంగా ధియేటర్ కౌంట్ విషయంలో సమంగానో లేదా కాస్త ఎక్కువో తక్కువ సర్దుకుని పంచుకోవాల్సి ఉంటుంది. తెలుగులో సాహోకు ఎదురుపడే సాహసం ఎవరూ చేయరు కాని బాలీవుడ్ లో మాత్రం గండం ఉంది. డార్లింగ్ బాహుబలి తరహలో వాటిని ఎలా దాటుకుని మరోసారి సాహో అనిపిస్తాడో వేచి చూడాలి