డైరెక్టర్ నందిని రెడ్డి.. హీరో నాగశౌర్య.. నిర్మాత దామోదర్ ప్రసాద్.. ఈ ముగ్గురూ కూడా హిట్టు కోసం తపిస్తున్నవాళ్లే. ఈ ముగ్గురికీ ‘కళ్యాణ వైభోగమే’ చక్కటి బ్రేక్ ఇచ్చింది. పరీక్షల సీజన్లో రిలీజవడం వల్ల టాక్ తగ్గట్లుగా ఆశించిన స్థాయిలో వసూళ్లు రావట్లేదు కానీ.. బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం పోటీలో ఉన్న మిగతా సినిమాలన్నింటికంటే బెటర్ గానే పెర్ఫామ్ చేస్తోంది ‘కళ్యాణ వైభోగమే’. తొలి వారాంతంలో రూ.3 కోట్ల దాకా షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం.. ఫుల్ రన్లో రూ.8 కోట్ల దాకా వసూలు చేయొచ్చని అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా అమెరికాలో ‘కళ్యాణ వైభోగమే’కు మంచి ఆదరణ దక్కుతోంది. అక్కడ ఇప్పటి 15 లక్షల డాలర్లు వసూలయ్యాయి. చివరికి 20 లక్షల మార్కును దాటే అవకాశాలున్నాయి. ఇప్పటికే లాభాల్లోకి వచ్చేసిన బయ్యర్.. బాగానే మిగుల్చుకునేలా ఉన్నాడు.
థియేట్రికల్ రన్ ద్వారా నిర్మాతకు మిగిలేది పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు కానీ.. శాటిలైట్ - రీమేక్ రైట్స్ ద్వారా మంచి లాభాలు అందుకునే అవకాశముంది. సినిమా విడుదలకు ముందు మంచి ప్రైస్ రాకపోవడంతో శాటిలైట్ హక్కుల్ని అలాగే అట్టిపెట్టుకున్నాడు దామోదర్. ఇప్పుడు ఛానెళ్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. రూ.2.5 కోట్ల దాకా వర్కవుట్ కావచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు ‘కళ్యాణ వైభోగమే’ రీమేక్ రైట్స్ కోసం కూడా మంచి పోటీ నెలకొందట. ఓ తమిళ ప్రొడ్యూసర్ తమిళ - కన్నడ భాషల హక్కుల కోసం పోటీ పడుతుంటే.. మరోవైపు హిందీ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఈ రకంగానూ నిర్మాతకు మంచి లాభమే అన్నమాట.