టాలీవుడ్ స్టార్ హీరోలంతా బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలకు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఒకదాని వెంటే ఒకటిగా ప్రణాళికా బద్దంగా ప్రతిదీ నడిపిస్తున్నారు. పవన్.. మహేష్.. ఎన్టీఆర్.. రామ్ చరణ్.. బన్ని.. ప్రభాస్ .. వీళ్లంతా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలకు సంబంధించిన ప్లాన్ ని సిద్ధం చేస్తున్నారు.
అలాగే నాలుగైదు నెలల గ్యాప్ తోనే అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో ట్రీటిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్ నటించిన రెండు సినిమాలు కేవలం నాలుగు నెలల్లోపు రిలీజవుతుంటే.. బన్ని కూడా ఇంచుమించు ఇలానే ఆలోచిస్తున్నాడు. చరణ్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ కి ఆచార్యకి రిలీజ్ గ్యాప్ పెద్దగా ఉండదు. ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ బరిలో ఉంటే ఆచార్య ఈ ఏడాది మేలోనే రిలీజవుతోంది. కేవలం నాలుగైదు నెలల గ్యాప్ తోనే రెండు సినిమాలతో ట్రీటివ్వబోతున్నాడు.
మరోవైపు ఎన్టీఆర్ తక్కువ వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ విడుదలలకు ప్లాన్ చేస్తుండడం ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే తారక్ కోసం ఏడాదిన్నర కాలంగా అభిమానులు ఎంతో ఓపిగ్గా వేచి చూస్తున్నారు. ఎట్టకేలకు అక్టోబర్ లో పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ రిలీజవుతోంది. తదుపరి కొద్ది నెలల్లో ప్రారంభం కానున్న త్రివిక్రమ్ మూవీని 2022 ప్రథమార్థంలోనే భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ లో ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉంటే ఏప్రిల్ నాటికే ఈ సినిమాని తేవాలన్నది ప్లాన్. త్రివిక్రమ్ చిత్రం ఏప్రిల్ 2022 చివరి వారంలో విడుదల కావచ్చనేది ఓ అంచనా.
అంటే ఎన్‌టిఆర్ కేవలం ఆరు నెలల్లో ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ సిద్ధం చేస్తున్నారన్నమాట. అయితే ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా ప్రతిదీ సాగిపోతే వరుస రిలీజ్ లు మన స్టార్ హీరోలకు కష్టం కాదు. క్రైసిస్ నుంచి బయటపడిన తర్వాత మరింత కసితో పని చేస్తున్నారంతా. అభిమాన తారల సినిమాలు థియేటర్లలో లేక అల్లాడిపోతున్న అభిమానులకు మునుముందు అంతా డబుల్ ధమాకా ఫెస్టివల్ అందుబాటులోకి వచ్చినట్టే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా 2021-22 సీజన్ ఫ్యాన్స్ కి పండగే పండగ.