‘జనతా గ్యారేజ్’ సినిమా తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లోకి చొచ్చుకెళ్లాడు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. ‘మనమంతా’ సినిమా ఆడకపోయినా అందులో ఆయన నటన మన ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన లాల్ డబ్బింగ్ సినిమా ‘మన్యం పులి’ తెలుగు లో సూపర్ హిట్టయింది. ‘కను పాప’ సైతం ఓ మాదిరిగా ఆడింది. దీంతో మోహన్ లాల్ కొత్త సినిమా ‘ఒడియన్’ మీద ఇక్కడి బయ్యర్ల కన్ను పడింది. ఈ చిత్రానికి మలయాళంలో ముందు నుంచి భారీ హైప్ ఉంది. దీన్ని మలయాళ ‘బాహుబలి’గా అభివర్ణించారు అక్కడి జనాలు. దీని ప్రోమోలు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉండటం.. మోహన్ లాల్ నట విశ్వరూపం చూపించబోతున్నాడని ప్రచారం జరగడంతో తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం పోటీ నెలకొంది.
దగ్గుబాటి రామ్.. సంపత్ కుమార్ అనే ఇద్దరు కొత్త నిర్మాతలు దాదాపు రూ.3 కోట్లు పెట్టి తెలుగు హక్కులు తీసుకున్నారు. దీనికి పబ్లిసిటీ ఇతర ఖర్చులు అదనం. ఎలాగోలా పెద్ద ఎత్తునే థియేటర్లు దక్కించుకుని సినిమాను రిలీజ్ చేశారు. ఐతే ‘ఒడియన్’కు దారుణమైన టాక్ వచ్చింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఫుల్ రన్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.60 లక్షల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి లో నాలుగో వంతు కూడా వెనక్కి రాకపోవడంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు.
వీళ్లు సొంతంగానే సినిమాను రిలీజ్ చేసుకున్నారట. మోహన్ లాల్ ను నమ్ముకుని నిండా మునిగిపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లాల్.. హైదరాబాద్ వచ్చి బాగానే ప్రమోషన్ కూడా చేసి పెట్టాడు. నిర్మాతలు సైతం పెద్ద ఎత్తున ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిసిటీ చేశారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. సినిమాలో విషయం లేనపుడు ఎంత చేసి ఏం లాభం?