ఆగస్టు 30 మోస్ట్ అవైటెడ్ తారీఖు. ఆరోజు ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `సాహో` రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం 450 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోందన్న టాక్ ట్రేడ్ వర్గాల్ని వేడెక్కిస్తోంది. ఇది కేవలం టాలీవుడ్ హిస్టరీలోనే కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే మునుపెన్నడూ చూడనిది అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది.
అందుకు తగ్గట్టే `సాహో` రిలీజ్ సమయంలో వేరొక సినిమా ఏదీ రిలీజ్ కావడం లేదు. దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తరభారత దేశంలోనూ సాహో అత్యంత క్రేజీగా అత్యంత భారీగా రిలీజ్ కి రెడీ అవుతోంది. 30న సాహు వస్తోంది కాబట్టి హిట్టు అన్న టాక్ వస్తే ఇక ఆ తర్వాత రెండు మూడు వారాల పాటు తేదీలు ఎవరికీ మిగలవు అన్న కంగారు ఇతర నిర్మాతల్లో కనిపిస్తోందట. అందుకే `సాహో` కంటే వారం ముందు వడ దెబ్బ తిన్న పిట్టల్లా పలు చిత్రాలు టపా టపా థియేటర్లలో పడిపోతున్నాయట.
ఇప్పటికిప్పుడు పది సినిమాలు రిలీజ్ అంటే ఏవి? అన్న సందేహం కలగొచ్చు. ఎందుకంటే `సాహో` ముందు ఇంకేదీ కనిపించకపోవడమే అందుకు కారణం. ఆ క్రేజు ముందు వేరే సినిమాలొస్తున్నాయి అన్న సంగతి కూడా ఎవరికీ తెలియడం లేదు. అయితే మొత్తంగా పది సినిమాలు ఈ శుక్రవారం (ఆగస్టు 23) రిలీజైపోతున్నాయట. వీటిలో కాస్తో కూస్తో ఐశ్వర్య ధనుష్ నటించిన `కౌశల్య కృష్ణమూర్తి` (భీమనేని-కె.ఎస్.రామారావు) చిత్రానికి ట్రైలర్ లాంచ్ చేసి ప్రచారం చేయడంతో తెలిసింది. కేఎఫ్ సీ వాళ్లు తీసిన `ఏదైనా జరగచ్చు` ప్రచారానికి కొత్తగా ప్లాన్ చేస్తున్నారట. ఇక మిగతా సినిమాలేవో ఎవరికీ తెలీదు. ఏదైనా జరగవచ్చు- నేనే కెడి నంబర్ 1- జిందా గ్యాంగ్- బాయ్- ఉండి పొరాదే- నివాసి- నీతోనే హాయ్ హాయ్- కనులు కనులు దోచేనే- హవా.. అంటూ చిన్న సినిమాలన్నీ రిలీజ్ కి 23వ తేదీని ఫిక్స్ చేసుకున్నాయట. అయితే ఆగస్టు 30న విడుదల అవుతున్న సాహు ఫీవర్ లో ఉన్న జనం ఇటువైపు చూస్తారా? అన్నది సందిగ్ధంగా మారింది. సాహోకి టిక్కెట్ రేట్లు పెంచుతారు కాబట్టి 30% మాస్ జనం ఈ వారం సినిమాలు చూడటం మానేసి సాహోకి డబ్బులు దాచుకుంటారు! అంటూ సెటైర్లు పేల్తున్నాయ్.