మరో వివాదంలో వర్మ!

Update: 2018-01-25 08:23 GMT
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వర్మ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు! ఏక‌కాలంలో ఇటు పోలీస్ స్టేష‌న్ అటు న్యాయ‌స్థానాల రూపంలో ఆయ‌నకు వ‌రుస షాక్‌లు త‌గిలాయి. గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ పేరుతో తీస్తున్న షార్ట్ ఫిల్మ్ పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఓ టీవీ చ‌ర్చ‌లో త‌న‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని దేవి అనే సామాజిక కార్యకర్త వర్మపై ఫిర్యాదు చేశారు. తనపై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వర్మపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్) పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

26వ తేదీన విడుదల అవుతున్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ షార్ట్ ఫిల్మ్ నిలిపివేయాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ నోటీసులను పంపింది.  దేశంలోని యువతను పెడదోవ పట్టిస్తున్న విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్మని చూసి.. మిగతా యువత కూడా సెక్స్ షార్ట్ ఫిల్మ్ వైపు మొగ్గుచూపే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. పేరున్న సినీ దర్శకుడు ఇలాంటి షార్ట్ ఫిల్మ్ తీయటం వల్ల.. మిగతా వారు కూడా అలాగే చేస్తారని.. అనుకరించే ప్రమాదం ఉందని మహిళా సంఘాల నేతలు మండిప‌డ్డారు.

మ‌రోవైపు ఈ సినిమా త‌న క‌థ అని గ‌తంలో వ‌ర్మ టీంలో ప‌నిచేసిన జ‌య‌కుమార్ అనే వ్య‌క్తి ఫిర్యాదు చేశాడు. వ‌ర్మ తీసిన సర్కార్-3లో అసోసియేట్‌గా పనిచేసిన‌ జయకుమార్ అనే వ్య‌క్తి ఈ మేర‌కు త‌న వాద‌న‌లు వినిపిస్తూ సిటీ సివిల్ కోర్టును ఆశ్ర‌యించాడు. గ‌తంలో తాను రాసుకున్న క‌థ‌ను వ‌ర్మ టీంలో ప‌నిచేసే స‌మ‌యంలో 2015లో ఆయ‌న‌కు చూపించి.. అభిప్రాయం చెప్పాలని కోరానని చెప్పారు. అయితే ఆ స్క్రిప్ట్‌ జీఎస్‌టీ ట్రైలర్‌గా ముందుకొచ్చేసరికి షాక్ తిన్నానని జయకుమార్ తెలిపాడు.తాను ఎంతో పవిత్రంగా రాసుకున్న కథను వర్మ శృంగారం, నగ్నత్వంతో నింపేశారని జయకుమార్ ఆరోపించారు.

ర‌చ‌యిత జ‌య‌కుమార్ పిటిష‌న్ నేప‌థ్యంలో దీనిపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. కాపీరైట్ వయోలేషన్ కింద దర్శకుడు వర్మ - పోర్న్ స్టార్ మియా మాల్కోవా - యూ ట్యూబ్ ఛానల్‌కు నోటీసులు జారీ చేసింది. కాగా, ఈ కాపీ ప‌ర్వంపై ఇటు వ‌ర్మ‌కు అటు జ‌య‌కుమార్‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం సాగింది. జ‌య‌కుమార్‌ను వ‌ర్మ జోక‌ర్ అని సెటైర్ వేయ‌గా....దానికి ఆయ‌న సైతం ధీటుగా స్పందించారు. `ఓకే నేను జోక‌ర్‌ ను..వ‌ర్మ నా బ్యాట్‌ మ‌న్‌` అంటూ ధీటైన స‌మాధానం ఇచ్చారు.
Tags:    

Similar News