షూటింగుల‌కు సిస‌లైన హ‌బ్ హైద‌రాబాదే

Update: 2022-03-10 05:07 GMT
సినిమా షూటింగుల‌కు ద‌శాబ్ధాలుగా హైద‌రాబాద్ సిస‌లైన హ‌బ్ గా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిన‌దే. మ‌ద్రాసు నుంచి ప‌రిశ్ర‌మ హైద‌రాబాద్ కి వ‌చ్చాక ఇక్క‌డ అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కేవ‌లం భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌ల‌కే కాదు ప్ర‌పంచ సినీప‌రిశ్ర‌మ‌ల‌కు హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీ సౌక‌ర్యాలు ఎంతో ఉప‌యుక్తంగా ఉన్నాయి. ఆన్ లొకేష‌న్ షూటింగ్ స‌హా ప్ర‌తిదీ సౌక‌ర్య‌వంతంగా పూర్తి చేసేందుకు అవ‌స‌ర‌మైన మౌళిక‌వ‌స‌తులు టెక్నాల‌జీ ఇక్క‌డ అందుబాటులో ఉంది. హైద‌రాబాద్ లో స్టూడియోలతో పాటు ఔట‌ర్ లో లొకేష‌న్లు కూడా ఎంతో పెద్ద ప్ల‌స్ గా మారుతున్నాయి. మ‌ళ్లీ మ‌రో ప‌రిశ్ర‌మ‌ను ఇంత ఇదిగా నిర్మించాలంటే అది అంత సులువు కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన నిజం.

అందుకే ఇండ‌స్ట్రీ ఏదైనా స‌రే షూటింగు మాత్రం హైద‌రాబాద్ లోనే! అన్న తీరుగా ఉంది.  హైద‌రాబాద్ ఇండియ‌న్ సినిమా హ‌బ్ గా క‌నిపిస్తోంది. ఇక్కడ తెలుగు-త‌మిళ చిత్రాల‌తో పాటు బాలీవుడ్ సినిమాలు విరివిగా తెర‌కెక్కుతున్నాయి. కొన్ని హాలీవుడ్ చిత్రాల షూటింగులు కూడా రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతున్నాయి. ఇక ఎంట‌ర్ టైన్ మెంట్ హ‌బ్ గా మారుస్తామ‌ని మంత్రి కేటీఆర్ ప‌లుమార్లు ప్ర‌క‌టించారు. అవ‌స‌రం మేర ప్ర‌తిదీ అందుబాటులోకి తెస్తామ‌న్నారు. యానిమేష‌న్ హ‌బ్ ని చేస్తామ‌ని కూడా అన్నారు. ముఖ్యంగా హైద‌రాబాద్ ని ఇండియ‌న్ సినిమా క్యాపిట‌ల్ గా మారుస్తామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించిన చందంగా ఇప్పుడు మారుతోంది.

తాజాగా త‌ళా అజిత్ త‌న భారీ చిత్రాన్ని హైద‌రాబాద్ లోనే ప్రారంభించారు. ఇక్క‌డే రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ సాగ‌నుంది. అజిత్ చివరిగా నటించిన వ‌లీమై చిత్రం తెలుగు బాక్సాఫీస్ వద్ద అంత‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ అతను దాని గురించి పట్టించుకున్న‌ట్టు క‌నిపించ‌లేదు. వెంట‌నే అదే దర్శకుడు హెచ్ వినోద్ - నిర్మాత బోనీ కపూర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈరోజు సింపుల్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే వారం నుంచి హైదరాబాద్  ఆర్‌.ఎఫ్.సిలో చిత్రీకరణ జరగనుందని సమాచారం.

బ్యాంకు దోపిడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అజిత్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇతర వివరాలు త్వరలో వెల్లడి కావాల్సి ఉంది. ర‌జ‌నీ కాంత్ ఇటీవ‌ల న‌వ‌త‌రానికి అవ‌కాశాలిచ్చి ఎంక‌రేజ్ చేసిన‌ట్టే త‌ళా అజిత్ కూడా ఇప్పుడు నేటి జ‌న‌రేష‌న్ కి అవ‌కాశాలిస్తున్నారు. తాను న‌మ్మిన ద‌ర్శ‌కుల‌కు జయాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా అవ‌కాశాలిస్తున్నారు.

త‌ళా అజిత్ మార్కెట్ త‌గ్గిందా?

త‌ళా అజిత్ న‌టించిన సినిమాలు త‌మిళంలో 100కోట్లు పైగా క‌లెక్ష‌న్స్ తో సునామీ సృష్టించ‌డం రెగ్యుల‌ర్ గా చూస్తూనే ఉన్నాం. అయితే అత‌డికి తెలుగులో అంతగా మార్కెట్ లేదా? త‌న‌ రేంజ్ ఇక్క‌డ 5 కోట్లు మించ‌డం లేదా? అంటే అవున‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అజిత్ న‌టించిన 'వ‌లీమై' తెలుగు రైట్స్ కి 5కోట్లు వెచ్చించారు. ఇది అజిత్ కి పెద్ద రేటు .. ఆ మొత్తాన్ని తిరిగి వెన‌క్కి తేవడం అంత సులువేమీ కాద‌ని ట్రేడ్ విశ్లేషించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

దానికి తోడు వ‌లీమైకి నెగెటివ్ రివ్యూలు స‌మ‌స్య‌గా మారాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టికెట్ రేట్ల స‌మ‌స్య కూడా ఒక కార‌ణం. నిజానికి అజిత్ ఇత‌ర త‌మిళ హీరోల‌తో పోటీప‌డుతూ వ‌రుస హిట్లు అందుకుంటున్నా అది త‌మిళం వ‌ర‌కే ప‌రిమితం. తెలుగు బాక్సాఫీస్ వ‌ద్ద ఇటీవ‌ల‌ అంత‌గా రాణించ‌డం లేదు. అయితే వ‌లీమై తో దానిని తిర‌గ‌రాస్తాడ‌నే భావించినా కుద‌ర‌లేదు.
Tags:    

Similar News